Home » తుస్సుమ‌న్న భీమ్లానాయక్ ట్రైల‌ర్…ఆ ఒక్క ట్వీట్ తో మ‌ళ్లీ అంచనాలు పెంచిన థ‌మన్..!

తుస్సుమ‌న్న భీమ్లానాయక్ ట్రైల‌ర్…ఆ ఒక్క ట్వీట్ తో మ‌ళ్లీ అంచనాలు పెంచిన థ‌మన్..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాలో రానా కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అంతేకాకుండా త్రివిక్ర‌మ్ సినిమాకు స్క్రీన్ ప్లే తో పాటూ మాట‌ల‌ను అందించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా వేసుకుంది.

ALSO READ : ర‌ష్మిక‌తో పెళ్లి అంటూ వార్త‌లు..దారుణ‌మైన బూతుతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఫైర్..!

Advertisement

Bheemla nayak

దాంతో ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర‌యూనిట్ నిన్న విడుద‌ల చేసింది. అయితే ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు పాట‌లు ట్రైల‌ర్ పై అంచ‌నాలను భారీగా పెంచగా ఆ అంచ‌నాల‌ను భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్ అందుకోలేక పోయింది. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సీన్లు గానీ ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు కానీ ట్రైల‌ర్ లో క‌నిపించ‌లేదు.

Advertisement

bheemla nayak review

దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అంతే కాకుండా ట్రైల‌ర్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటే రానా ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో క‌నిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ స్పందించారు. థియేట‌ర్ లో రాంప్ అమ్మా అంటూ కామెంట్ చేశారు.

bheemla nayak adavi thalli song

అన్నీ థియేట‌ర్ లోనే ఆశిస్తే ఎలా….ఫారెస్ట్ ఫైర్ కు లోక‌ల్ ఫైర్ కు తేడా లేదా…క‌లుద్దాం….అంతూ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక థ‌మ‌న్ ట్వీట్ తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ లో మళ్లీ ఆశలు చిగురించాయి. భీమ్లా నాయ‌క్ సినిమా పై మ‌ళ్లీ అంచనాలు పెరిగాయి. మ‌రి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading