కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ అన్నీ సరిగ్గా కుదిరినప్పటికీ ఎందుకు పరాజయం పాలవుతాయో అర్థం కాదు. స్క్రీన్ ప్లే లోపాలు ఎంత హిట్ సినిమాకు అయినా ఒక్కడో ఒక చోట ఉంటాయి. కథ, ఆర్టిస్ట్‌ల ఫర్‌ఫార్మెన్స్ సంగీతం లాంటివి ఆ లోపాలను అధిగమిస్తాయి. అయినా సరే ఆ సినిమా హిట్ అవ్వలేదంటే ఇంకా ఏవో కారణాలుండి ఉంటాయి. అటువంటి సినిమానే రాయలసీమ రామన్న చౌదరి. మోహన్‌బాబు 500వ చిత్రంగా భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా పరాజయం పాలు కావడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also Read : పదహారణాల అమ్మాయి అని ఎందుకు అంటారో తెలుసా..?
1999 సంవత్సరంలో మోహన్‌బాబు నటుడిగా 500 సినిమాలకు దగ్గరవుతున్న సందర్భం అంది. అత్యుత్తమ విలువలతో తన 500 సినిమాను చేయాలని భావించాడు. పరిచూరి బ్రదర్స్‌కు కథ బాధ్యతలు అప్పగించారు. దర్శకునిగా బి.గోపాల్ చేయమని అడగగా.. మహేష్ బాబు సినిమాతో చేస్తానని బి.గోపాల్ మాట ఇచ్చారు. ఇందులో రజినీకాంత్ దేవుడి మీద సినిమా చేయాలని స్వయంగా తానే రెండు కథలు రాశాడు. బాబా తన వద్దనే ఉంచుకొని ఎప్పటి నుంచో సతమతమవుతున్న తన ఆప్తమిత్రుడు మోహన్‌బాబును రమ్మని రజినీ ఫోన్ చేశారు. రజినీకాంత్ కథ మొత్తం చెప్పి ఇది నీకు సూటవుతుందని చెప్పాడు. మీ స్టైల్‌లో మార్చి సినిమాను చేద్దామా అని పరుచూరి బ్రదర్‌ను అడిగారు మోహన్‌బాబు.
వారికి కాస్త ఆశ్చర్యం వేసింది. రజినీకాంత్ ఎప్పుడు రైటర్ అయ్యారని..? ఎన్నో కథలు రాసిన వారికి వేరే వారి కథలు తీసుకొని స్క్రిప్ట్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఆ కథలో గొప్పతనం అర్థమై ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు పరుచూరి బ్రదర్స్. ఆ కథకు టైటిల్ రాయలసీమ రామన్న చౌదరి. ముఖ్యంగా పరుచూరి బ్రదర్‌కు ఈ స్టోరీ భలే నచ్చేసింది. రామన్న క్యారెక్టర్ జోడీగా జయసుధను తీసుకున్నారు. తొలుత గృహ ప్రవేశం సినిమాలో మోహన్‌బాబు, జయసుధ జంట కలిసి నటించారు. మళ్లీ 2000లోనే ఈ జంటకు తరువాత మళ్లీ 2000లోనే ఈ జంటకు సినిమా సెట్ అయింది.
సెకండ్ మోహన్‌బాబు క్యారెక్టర్‌ను ముందుగా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా ఎవరైనా హీరోతో కానీ చేద్దాం అనుకున్నారు. ఫైనల్ గా ఆ క్యారెక్టర్ కూడా మోహన్ బాబే పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో రజినీకాంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చి యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి, రాజమండ్రి, రామానాయుడు స్టూడియో లలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా కోసం 30 కెమెరాలను వాడారు. పాటల కోసం థాయ్‌లాండ్, మలేషియా వెళ్లారు.
మోహన్‌బాబు బడ్జెట్ కాకుండా కేవలం 3 కోట్ల బడ్జెట్‌తో నాలుగు నెలల వ్యవధిలోనే సినిమా పూర్తవ్వడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో గుర్రపు బండిమీద పడి మోహన్‌బాబు గాయపడడంతో ఆగస్టులో విడుదల చేద్దామనుకున్న మూవీ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. అందరూ సూపర్ అని పొగిడిన రాయలసీమ రామన్న చౌదరికి ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ వచ్చింది. పెదరాయుడు వంటి సంచలనాలు మళ్లీ మోహన్‌బాబు సృష్టించబోతున్నాడనే అంచనాలు పెరిగిపోయాయి. కానీ 2000 సెప్టెంబర్ 15న విడుదలైన రాయలసీమ రామన్నచౌదరి మోహన్‌బాబుకు భారీ హంగామా చేసిన లాస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. తిరుపతిలో కలెక్షన్‌లతో పాటు హిట్ టాక్ కూడా సొంతం చేసుకుంది.
Advertisement
Also Read : మోహన్ బాబు నివాసానికి మంత్రి పేర్నినాని..కీలక అంశాలపై చర్చ..!
ముఖ్యంగా మోహన్ బాబు వన్ మ్యాన్ షోతో రఫ్పాడిస్తాడు. తెల్ల పంచె, బ్లాక్ షర్ట్ వేసుకుని నడిచి వస్తుంటే.. ముఖ్యంగా ప్రతీ ఐదు నిమిషాలకొకసారి విజిల్స్ వేయిస్తారు. దేవుడిని నమ్మని నాస్తికుడిగా, అద్భుతమైన నటన కనబరిచి క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా జీవించారు మోహన్‌బాబు. పవర్‌పుల్ నటన అంటే ఏమిటో చెప్పే టాప్ మూవీస్‌లో ఇది కూడా ఒకటి. ఆయన చెప్పే డైలాగ్‌లు అరాచకమే. ప్రతీ డైలాగ్‌కు థియేటర్ దద్దరిల్లిపోతుంది. ముఖ్యంగా దేవుని గురించి చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. సినిమా అయిపోయాక ఆయన డైలాగ్‌లే గుర్తుకువస్తాయి. ఆ డైలాగ్‌లతో పాటు మణిశర్మ మ్యూజిక్ హైలెట్. ముఖ్యంగా రామన్న చౌదరీ టైటిల్ సాంగ్ సూపర్ అనే చెప్పవచ్చు.
ఫస్టాఫ్ కాస్త అటు ఇటు అయినా కానీ సెకండాప్ అందరినీ ఆకట్టుకుంది. పాజిటివ్ రివ్యూ సొంతం చేసుకున్న రాయలసీమ రామన్న చౌదరి ఎందుకు విజయం సాధించలేదు. ప్రమోషనల్‌గా ఈ సినిమా యావరేజ్ అనే చెప్పాలి. మంచి హిట్ అవ్వాల్సిన మూవీ ఎందుకు ఆడలేదంటే.. మూడు కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది స్క్రీన్ ప్లే లోపం ముఖ్యంగా రామన్న మరణించడం పెద్ద మైనస్ అని చెప్పాలి. అదేవిధంగా రెండవ మోహన్‌బాబుకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం క్లైమాక్స్‌లోనైనా ఆ క్యారెక్టర్‌ను భాగస్వామ్యం చేయాల్సింది. ఈ సినిమాలో దైవం, నాస్తికత్వం, ఫిలాసపి ఇవేవి అప్పటి ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. అందుకే సినిమాలో ఉన్న మెయిన్ థీమ్‌కు కనెక్ట్ కాలేకపోయారు.
ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో బాగా ఆడినా ఏ సెంటర్‌లో మాత్రం అంతగా ఆడలేదు. బీ, సీ సెంటర్లలో సినిమాను హిట్ చేశారు. వారు సినిమా చూసింది కేవలం మోహన్ బాబు కోసం మాత్రమే అని చెప్పవచ్చు. మరొకవైపు పోటీ కూడా ఉండడం ఈ సినిమా హిట్ కాలేకపోయిందనే చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు నిన్నేప్రేమిస్తా సినిమా సూపర్ హిట్ టాక్‌తో విడుదల అయింది. మరొక రెండు వారాలనే ఆజాద్ మూవీ విడుదల అయింది. మూడు వారాలకు జయం మనదేరా.! ఇక సినిమాలు విడుదల కావడంతో రామన్న చౌదరి థియేటర్లు సగానికి పైగా పడిపోయాయి. ముఖ్యంగా జయం మనదేరా సినిమాకు ఎక్కువ థియేటర్లలో విడుదల అయింది. ఇది విడుదల వారం రోజులకే నువ్వే కావాలి సినిమా విడుదల అయి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇలా రకరకాల సినిమాలు రావడంతో రాయల సీమ రామన్న చౌదరి సినిమా విజయానికి కాస్త దూరంగా ఆగిపోయింది. ఈ సినిమా బాక్సాపీస్ విషయానికి వస్తే.. మొదటి వారం రూ.2కోట్లు వసూలు చేసి ఆ సంవత్సరంలో బెస్ట్ సినిమాగా నిలిచింది. 38 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించారు. మొత్తానికి 5 కోట్లు గ్రాస్ వసూలు చేసి కమర్షియల్ గా యావరేజ్ సినిమాగా నిలిచింది. ఇరవై రెండేల్ల కాలంలో ఇలాంటి మూవీని మోహన్ బాబు చేయకపోవడం విశేషం.
Also Read : 24గంటల్లో యూట్యూబ్ ను షేక్ చేసిన టీజర్లు ఇవే..!