మనిషి ఎలా జీవించాలి ఎలా చేయించకూడదు ఎలాంటి నియమాలు పాటిస్తే సమాజంలో గౌరవం లభిస్తుంది లాంటి ఎన్నో అంశాలను చాణక్యుడు తన చాణక్యనీతి గ్రంథం ద్వారా ప్రజల ముందు ఉంచారు. ఆర్థిక, రాజకీయ, మనోవిజ్ఞానపరమైన అంశాల ద్వారా చాణక్యుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందువల్ల ఇప్పటికి చాణక్య నీతిని ప్రజలు పాటిస్తున్నారు. చాణక్యుడు జీవితంలో వ్యక్తిత్వాన్ని మార్చుకునే కొన్ని అంశాలను బోధించాడు అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆహారం
Advertisement
మనం తినే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుందని చాణక్యుడు తెలిపాడు. కాబట్టి సాత్వికమైన మంచి ఆహార పదార్థాలను తినాలని ఆయన సూచించారు. దీపం చీకటిని తినేస్తుంది అందుకే అది నల్లని పొగను సృష్టిస్తుంది. అదే విధంగా మనం తినే ఆహారం కూడా మన మనసును ప్రభావితం చేస్తుందని చెప్పారు.
విద్య
వ్యక్తిత్వం లో అతి ముఖ్యమైన అంశం విద్య. విద్యాభ్యాసం చేసిన వారికి ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. తన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతాడు. ఏది తప్పు ఏది ఒప్పు అనే అంశాలు ఖచ్చితంగా తెలుసుకుంటాడని చెప్పాడు.
Advertisement
ఆస్తి వారసత్వం కాదు
ఆస్తికి వారసుడే యజమాని అనే విధానాన్ని చాణిక్యుడు తప్పుపట్టాడు. ఆస్తి సమర్థులకు అప్పగించాలని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులు నైపుణ్యం ఉన్న వారికి ఆస్తి అప్పగిస్తే సద్వినియోగం చేస్తారని చాణక్యుడు తన నీతి ద్వారా తెలిపాడు. అర్హతలేనివారికి అప్పగిస్తే అది దుర్వినియోగం అవుతోందని పేర్కొన్నారు.
అందం జ్ఞానం
మనిషి అందంగా ఉంటే సరిపోదు అని అందంతో పాటు జ్ఞానం కూడా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నాడు. జ్ఞానం అవగాహన లేకపోతే అందం ఎంత ఉన్నా కూడా ప్రయోజనం ఉండదని తెలిపారు. అలాంటి వారు చూడ్డానికి అందంగా ఉన్నప్పటికీ మనసు అందంగా ఉండదు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో చూడాల్సింది అందం కాదని తెలిపాడు.
మనసు సంస్కరణ
మనసుని సంస్కరించుకోవాలని చాణక్యుడు తెలిపాడు. ప్రతి వ్యక్తి జీవితంలో అసంతృప్తి అనేది ముఖ్యమని సంతృప్తి పొందడం ప్రారంభిస్తే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదని తెలిపాడు. దురాశను నియంత్రిస్తూ ఉన్నట్లయితే దానిని మించిన విజయం మరొకటి ఉండదని చాణక్యుడు పేర్కొన్నాడు.