చాలా మంది తమ కోసం తాము బ్రుతుకుతారు. కానీ కొంతమంది మాత్రం తమ చుట్టుఉన్న ప్రకృతికోసం,ప్రజలకోసం, జీవరాశికోసం బ్రతుకుతూ ఉంటారు. అలాంటి ఓ యువతే స్నేహాసాహి. గుజరాత్ కు చెందిన స్నేహాసాహి ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే ప్రస్తుతం చెత్తాచెదారం ఫ్యాక్టరీల వల్ల నదులు కలుషితం అవతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమే స్నేహసాహిని కదిలించింది. నది కలుషితం అయితే అందులో ఉండే జీవరాశి మనుగడ ఏం కావాలి అని ఆలోచించింది. ప్లాస్టిక్ కవర్లు, థర్మాకోల్ లాంటివి నీటిలో ఉండటం వల్ల చేపలకు ఇతర జలరాశులకు ఊపిరి ఆడదు అని కీలక నిర్ణయం తీసుకుంది.
Advertisement
తానే నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది. అనంతరం సింగిల్ గా నదిలోని చెత్తను శుభ్రం చేసింది. అప్పుడప్పుడూ తన స్నేహితులు కూడా సాయం చేశేవారని స్నేహ సాహి చెబుతోంది. ఇక ఒంటరిగా 700కిలోల చెత్తను నది నుండి ఏరివేయడంతో ప్రస్తుతం స్నేహ పై ప్రశంసలు కురుస్తున్నాయి. పలు స్వచ్చంద సంస్థలు స్నేహ సంకల్పానికి మెచ్చుకుంటూ అవార్డులు కూడా ఇచ్చాయి. ఇదిలా ఉండగా తనకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టమని స్నేహ సాహి చెబుతోంది. చిన్ననాటి నుండి సోషల్ సర్వీస్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పింది.
Advertisement
ALSO READ : అఖండలో మరో మిస్టేక్…బోయపాటి పై ట్రోల్స్…!