Home » అఖండలో మరో మిస్టేక్…బోయపాటి పై ట్రోల్స్…!

అఖండలో మరో మిస్టేక్…బోయపాటి పై ట్రోల్స్…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో ఈ సినిమా హాట్రిక్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 50 రోజుల లోనే 200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి అఖండ విజయం సాధించింది.

Advertisement

ఈ సినిమాపై బాలీవుడ్ హీరోలు సైతం కన్నేసినట్టుగా ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ ఈ సినిమా హక్కులకోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను రీసెంట్ గా ఓటీటీలో విడుదల చేసారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ కూడా బాలయ్య హవా నడుస్తోంది.

Advertisement

అయితే ఒకప్పుడు థియేటర్లలో, టీవీలో ప్రేక్షకులు సినిమాలు చూసేవారు అప్పుడు సినిమాలోని చిన్న చిన్న మిస్టేక్స్ ను గుర్తు పట్టే వారు కాదు. కానీ ప్రస్తుతం సినిమాలు ఓటిటిలో విడుదలవడం వల్ల అందులోని చిన్న చిన్న మిస్టేక్స్ ను సైతం ప్రేక్షకులు పట్టేస్తున్నారు. ఆ తర్వాత ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖండ సినిమాలోని ఓ చిన్న మిస్టేక్ దొరికిపోయింది.

అఖండ సినిమాలో ఓ సమావేశం జరుగుతుండగా బాలయ్య సినిమాలో మినిస్టర్ గా వ్యవహరించిన సుబ్బరాజును పొగిడే సన్నివేశం ఉంటుంది. ఆ సందర్భంలో బాలకృష్ణ తన చేతిని సుబ్బరాజు ఓ వైపు ఉంటే మరోవైపు చూపిస్తారు. అయితే ఈ మిస్టేక్ ను థియేటర్లలో ఎవరూ గమనించలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ మిస్టేక్ గుర్తుపట్టి బోయపాటి ని ట్రోల్ చేస్తున్నారు.

Also read : భాగ్య‌ల‌క్ష్మీ బంప‌ర్ డ్రా…అప్ప‌ట్లో ప్ర‌భుత్వ‌మే దీన్ని నిర్వ‌హించేది!

Visitors Are Also Reading