మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ తన భర్త కల్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతోంది అన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పటి వరకూ శ్రీజ విడాకుల వార్తల పై మెగాఫ్యామిలీ స్పందింలేదు. కానీ శ్రీజ కల్యాణ్ దేవ్ ల వాలకం చూసి నెటిజన్లు ఇద్దరూ విడిపోతున్నారంటూ కన్ఫామ్ చేసుకున్నారు. విడాకుల వార్తలకు బలం చేకూరేలా శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి కల్యాన్ దేవ్ పేరును తొలగించింది.
Advertisement
శ్రీజ కొనిదెలగా తన పేరును మార్చుకుంది. అంతే కాకుండా తన భర్తతో దిగిన ఫోటోలను కానీ తన భర్త సినిమాల గురించి కానీ శ్రీజ అసలు పోస్టులు పెట్టడం లేదు. దాంతో వీరిద్దరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే శ్రీజ తన సోదరుడు రామ్ చరణ్ తో కలిసి ముం
బైకి వెళ్లింది. అక్కడ వీరిద్దరూ కెమెరాకు చిక్కగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతే కాకుండా విడాకుల కారణంగా శ్రీజ డిప్రెషన్ లోకి వెళ్లిందని అందువల్లే చరణ్ ఆమెను ముంబై తీసుకువెళ్లాడని కూడా వార్తలు గుప్పు మంటున్నాయి. అయితే తాజాగా శ్రీజ చేసిన ఎమోషనల్ పోస్ట్ చూస్తుంటే ఆ వార్తలు నిజమేనేమో అనిపిస్తున్నాయి.
శ్రీజ తన ఇన్స్టా గ్రామ్ లో హగ్స్…ఇవే నినింకా సంతోషంగా బ్రతికి ఉన్నందుకు కారణాలు…అంటూ పేర్కొంది. ఇక ఇదే పోస్ట్ లో శ్రీజ సోదరి సుస్మిత నన్ను వదిలేసి వెళ్లినందుకు థాంక్స్ అంటూ తన కామెంట్ చేసింది.