ఐటి ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్ లో ఉండే కంపెనీ ఇన్ఫోసిస్. ఈ కంపెనీ కో ఫౌండర్ నారాయణ మూర్తి చాలా శాతం మందికి తెలిసినదే. ఈయన ఎంతో ముందుచూపుతో ఆలోచించి కంపెనీను పైకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఐటి ఇండస్ట్రీలో ఎంతో మంచి సేవలను అందించడంతో పాటుగా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి పేరును ఈయన సంపాదించుకున్నారు అనే చెప్పవచ్చు.
Advertisement
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈయనను టాయిలెట్ క్లీనింగ్ గురించి ప్రశ్నించడం జరిగింది. అది ఏమిటంటే నారాయణ మూర్తి వారి టాయిలెట్స్ ను ఆయనే శుభ్రం చేస్తారు అని, అయితే దానికి ఈ విధంగా నారాయణ మూర్తి సమాధానం ఇచ్చారు. ఎవరి టాయిలెట్స్ ను వారు శుభ్రం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, అది మన బాధ్యత అని సమాజంలో అందరూ గౌరవాన్ని పొందాలి అని అది ఏ ప్రొఫెషన్ అయినా సరే అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈక్వాలిటీ గురించి అందరికీ తెలియజేశారు.
Also read:
Advertisement
Also read:
అంతేకాకుండా వారి పిల్లలకు కూడా ఇటువంటి మంచి వ్యక్తిత్వాన్ని పొందేలా ఇలాంటి ఎన్నో విషయాలను చెబుతూ ఉంటారు. ముఖ్యంగా మనకంటే ఎవరూ తక్కువ కాదు కాకపోతే మన పరిస్థితులను దేవుడు అనుకూలంగా చేయడం వల్ల ఇలా ఉన్నాము అని చెబుతారు. చాలా మంది దేశంలో ఎవరి టాయిలెట్ వారు శుభ్రం చేసుకుంటే ఎంతో పెద్ద తప్పు అని భావిస్తారు. ముఖ్యంగా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని పనులను చేసుకోవడానికి ఇతరులపై ఆధార పడకూడదు అనే ఉద్దేశంతో మరియు ఇతర ప్రొఫెషన్స్ ను తక్కువ చేయకూడదు అని వారి పిల్లలకు మరియు మనవల్లకు కూడా ఇంట్లో చేసుకునే పనుల గురించి చెప్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!