Chanakya Niti: ఆచార్య చాణక్య ఎన్నో అద్భుతమైన విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో మార్పులు జీవితంలో వస్తాయి ఆచార్య చాణక్య స్నేహితుల గురించి భార్యాభర్తల గురించి స్త్రీల గురించి ఇలా అనేక విషయాల గురించి ప్రస్తావించారు. కొన్ని విషయాల్లో పురుషుల కంటే స్త్రీలే ముందు ఉంటారని చాణక్య అన్నారు. మరి చాణక్య చెప్పిన అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడే చూద్దాం. చాణక్య ప్రకారం నాలుగు విషయాల్లో పురుషుల కంటే స్త్రీలు ముందుంటారట. చాణక్య ప్రకారం స్త్రీలు పురుషుల కంటే తెలివైన వాళ్ళు. మహిళలు యొక్క జ్ఞానం కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మహిళలు వాటిని సులభంగా పరిష్కరిస్తారు.
Advertisement
కష్ట సమయాల్లో ఏ విధంగా స్పందించాలి ఎలా బయటపడాలి అనే విషయం పురుషుల కంటే స్త్రీలకి బాగా తెలుసు అని చాణక్య అన్నారు. అలానే స్త్రీలు పురుషులు కంటే ధైర్యవంతులు అని కూడా చాణక్య అన్నారు. స్త్రీల కంటే పురుషులు ధైర్యవంతులని భావిస్తారు. చాణక్య ప్రకారం పురుషుల కంటే స్త్రీలే చాలా విషయాల్లో ధైర్యంగా ఉంటారు ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ధైర్యం మాత్రం పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. వంద మంది పురుషులు ఉన్నచోట కూడా స్త్రీ ధైర్యంగా ఉండగలదు. వంద మంది స్త్రీలు ఉన్నచోట పురుషుడు ధైర్యంగా ఉండలేడట.
Advertisement
Also read:
- పెళ్లి తరవాత పురుషులు బరువు పెరిగిపోవడానికి కారణం ఏమిటో తెలుసా..?
- ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !
- సంచలన శపథం చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు…!
అలానే చాణక్య ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఆకలితో ఉంటారు ఎక్కువ తింటారు కారణం శరీర నిర్మాణం పురుషులతో పోలిస్తే మహిళలకు అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాటి కోసం పెద్ద మొత్తంలో క్యాలరీలు అవసరమవుతాయి అందుకని ఎక్కువ ఆకలి మహిళలకి పురుషుల కంటే ఉంటుంది. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ సున్నితంగా ఉంటారు ఏదైనా ఆలోచనని త్వరగా గ్రహిస్తారు. వారి బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. స్త్రీల శరీరం కూడా చాలా సున్నితంగా ఉంటుంది చిన్న బాధని కూడా పెద్దగా భావిస్తూ ఉంటారు ఇలా పురుషులు కంటే ఈ నాలుగు విషయాల్లో స్త్రీలు ముందు ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!