ఏ వ్రతం చేసినా దానికి ముందురోజు రాత్రి ఆహార విసర్జనం చేయాలి, లేదా అల్పాహారమైనా స్వీకరించాలి. ప్రాతఃకాలం బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేస్తూ ప్రక్కమీద ఉండగానే ఇష్టదేవతను, గణపతిని, బ్రహ్మవిష్ణురుద్రులను, అష్టదిక్పాలకులను స్మరించుకుని ” ఈరోజు నేను మహాశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పించుకున్నాను. నీ అనుగ్రహం చేత ఇది నిర్విఘ్నంగా జరగాలి” అని సదాశివుని ప్రార్థన చేసి అటుపై కాలకృత్యాలు తీర్చుకుని శివారాధనకు ఉపక్రమించాలి. రోజంతా ఉపవాస జాగరణలు చేసి మరుసటి రోజు ప్రాతఃకాలంలో మళ్ళీ శివారాధన చేసి శివునికి నివేదించిన ఆహార పదార్థాలు సేవించాలి. ఇది అసలైన ఉపవాస దీక్ష.
Advertisement
Advertisement
కాని ఈ రోజుల్లో ఉపవాస దీక్షలు కరెక్ట్ గా చేస్తే ఆరోగ్యసమస్యలు తలెత్తున్నాయి. కాబట్టి ఏదైనా సాత్వికఆహారం తీసుకొని రోజంతా శివన్నామస్మరణతో గడపాలి. ఇలా చేస్తే స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ముందు రోజు తిన్న ఆహారం ఇంకా పొట్టలో అలానే ఉంటుంది. కాబట్టి తర్వాత రోజుకు కడుపు ఖాళీ గా ఉండాలి అందుకే సాత్వికాహారం తప్పకతీసుకోవాలి. శివరాత్రి రోజు బ్రహ్మాముహూర్తం లో దీపం పెట్టడం కంపల్సరీ. ఇళ్లంతా శుభ్రం చేసుకొని స్వామి వారికి పండ్లు , పూలు, కూరగాయలు పెట్టి పూజించుకుంటే మంచిది.
Also Read : ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళుతున్న రాజమౌళి.?