Home » ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళుతున్న రాజమౌళి.?

ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళుతున్న రాజమౌళి.?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ ద‌ర్శ‌క దిగ్గజం రాజమౌళికి సినిమాలంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఏ సినిమా విడుద‌లైన టాక్ బాగుంటే థియేట‌ర్‌కు చెక్కేస్తాడు. ఇక రాజమౌళి చాలావ‌ర‌కు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోనే సినిమా చూడ‌టానికి వెళతారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రాజమౌళి మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ప్రేమ‌లు సినిమా చూడటానికి వెళుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

మ‌ల‌యాళం నుంచి వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘ప్రేమ‌లు’. గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చి ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో రాజమౌళి త‌న‌యుడు ఎస్‌ఎస్ కార్తికేయ విడుదల చేస్తున్నారు. మార్చి 08న తెలుగు వెర్ష‌న్ విడుద‌ల కానుంది. ఇక సినిమాకు టాక్ మంచిగా రావ‌డం.. మ‌రోవైపు కొడుకు రిలీజ్ చేస్తున్న సినిమా కావ‌డంతో మూవీపై బ‌జ్ ఏర్పడటానికి రాజ‌మౌళి ఈ సినిమా చూడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో రేపు ఉదయం 11:45 గంటలకు రాజ‌మౌళి ఈ సినిమాను చుడనున్నట్లు సమాచారం. రాజ‌మౌళితో పాటు ప‌లువురు ప్రముఖులు కూడా ఈ స్క్రీనింగ్‌లో పాల్గొననున్నారు. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఫహద్ ఫాజిల్  నిర్మించిన ఈ సినిమాను గిరీష్ ఏడీ దర్శకత్వం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Also Read :  లాల్‌సలామ్‌ ఫ్లాప్‌కు కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading