Home » తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే..?

తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే..?

by Anji
Ad

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024, తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్‌-2024) నోటిఫికేషన్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 01 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ఏప్రిల్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ లాసెట్‌), తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్‌)-2024లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్‌ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత ఉండాలి. అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్ అర్హత, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

జూన్ 3వ తేదీన ఉదయం, మధ్యాహ్నం.. రెండు షిఫ్టుల్లో రాత పరీక్ష జరుగుతుంది. ఉదయం షిఫ్టు 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో కనీసం 35 శాతం మార్కులు అంటే 42 మార్కులు సాధించాలి. షెడ్యూల్‌ కులాలు లేదా ట్రైబల్‌ కులాలకు చెందిన అభ్యర్ధులకు ప్రవేశ పరీక్షలో ఎలాంటి పరిమితులు లేవు. లాసెట్ ఇంగ్లిష్/ తెలుగు, ఇంగ్లిష్/ ఉర్దూ మూడు భాషల్లో జరుగుతుంది. పీజీఎల్‌సెట్‌ మాత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 15, 2024వ తేదీ లోపు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు సమయంలో లాసెట్‌ 2024కు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600లు రిజిస్త్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. పీజీఎల్‌సెట్‌ 2024కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.900 రిజిస్త్రేషన్‌ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీల వివరాలు  :

  • ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 01, 2024 నుంచి ఏప్రిల్‌ 15, 2024 వరకు.
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీలు: ఏప్రిల్‌ 25, 2024.
  • రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీలు: మే 5, 2024.
  • రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీలు: మే 15, 2024.
  • రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీలు: మే 25, 2024.
  • టీఎస్‌ లాసెట్‌- 2024, టీఎస్ పీజీఎల్‌సెట్‌-2024 పరీక్షల నిర్వహణ తేదీ: జూన్‌ 03, 2024.

Also Read :  సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని చెబుతున్న సమంత..!

Visitors Are Also Reading