తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదమే చోటు చేసుకుంది. యువ రాజకీయ నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డ్రైవర్ కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి ఆమె విజయాన్ని సాధించారు. తన తండ్రి దాదాపు 5 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Advertisement
Advertisement
తండ్రి సాయన్న గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్యకి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఎస్సీ రిజర్వేషన్ కలిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో బీజేపీ నుంచి శ్రీగణేష్, కాంగ్రెస్ నుంచి దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి కుమార్తె వెన్నెల పోటీ చేశారు. ఈ నియోజకవర్గానికి తండ్రి సాయన్న చేసిన సేవలు లాస్య నందిత విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో 37 ఏళ్ల వయస్సులోనే మొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న లాస్య నందిత.. చిన్న వయస్సులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నాయకులు విచారం వ్యక్తం చేసారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న ఆమె ఇలా హఠాన్మరణానికి గురికావడం పట్ల నియోజకవర్గ ప్రజలు దిగ్బ్రాంతికి గురవుతున్నారు.
Also Read : శ్రీదేవి, జయప్రదను ఒకే గదిలో పెట్టి తాళం వేసిన హీరో ఎవరో తెలుసా ?