Home » శ్రీదేవి, జయప్రదను ఒకే గదిలో పెట్టి తాళం వేసిన హీరో ఎవరో తెలుసా ?

శ్రీదేవి, జయప్రదను ఒకే గదిలో పెట్టి తాళం వేసిన హీరో ఎవరో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

మధ్యతరం హీరోయిన్లలో శ్రీదేవి, జయప్రదలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకరినీ మించి ఒకరు తమ అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. వీరిద్దరిలో ఎవ్వరో ఒకరూ సినిమాలో ఉన్నారంటే చాలా ఆ సినిమాకి జనాలు క్యూ కట్టే వారు. అంత పాపులారిటీ సంపాదించుకున్నా శ్రీదేవి, జయప్రద. వీరు బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటారు. అప్పట్లో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది.

Advertisement

శ్రీదేవి, జయప్రదలలో సీనియర్ ఎవరు..? అంటే శ్రీదేవి అనే చెప్పాలి. నాలుగేళ్ల వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తోంది. 1975లో విడుదలైన ‘అనురాగాలు’ చిత్రంలో శ్రీదేవి మొదటిసారి హీరోయిన్‌గా నటించింది. అయితే అంతకు ఒక సంవత్సరం ముందే ‘భూమికోసం’ చిత్రంతో జయప్రద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ విధంగా చూస్తే శ్రీదేవి కంటే జయప్రద సీనియర్‌. హీరోయిన్‌గా జయప్రదకే మొదట స్టార్‌డమ్‌ వచ్చింది. 1977లో వచ్చిన ‘అడవిరాముడు’ చిత్రంతో ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది. శ్రీదేవికి మాత్రం హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన మూడేళ్ళ తర్వాత ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంతో బ్రేక్‌ వచ్చింది.

 

 ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘వేటగాడు’ చిత్రంతో శ్రీదేవి గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలతోనే స్టార్‌డమ్‌ రావడం విశేషం.  అదే ఏడాది కృష్ణ హీరోగా వచ్చిన ‘బుర్రిపాలెం బుల్లోడు’ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్‌గా ఎంపికైంది. వాస్తవానికి ఈ సినిమాలో మొదట జయప్రదను హీరోయిన్‌గా అనుకున్నారు. 5 వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. తర్వాత ఆ స్థానంలో శ్రీదేవిని తీసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రాజుకోవడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.అప్పటి నుంచి ఇద్దరి మధ్యా పోటీ పెరిగింది. సినిమాలతో ఇద్దరూ బిజీ అయిపోయారు.

Advertisement

 

తెలుగులో వచ్చిన ‘దేవత’ చిత్రాన్ని చూస్తే అక్కా చెల్లెళ్ళుగా ప్రేక్షకుల్ని ఇద్దరూ ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే. నిజజీవితంలో అక్కాచెల్లెళ్ళు కూడా అంత అన్యోన్యంగా ఉండరు అనేంత పేరు తెచ్చుకున్నారిద్దరూ. సినిమాల్లోని క్యారెక్టర్స్‌ చేసేటపుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునే ఇద్దరూ షాట్‌ అవ్వగానే ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. జయప్రద ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఇద్దరం మాట్లాడుకోం. నిజం చెప్పాలంటే శ్రీదేవి కొంచెం యారగెంట్‌గా ఉండేది. ఇద్దరం షాట్‌లో పోటాపోటీగా నటించినా.. ఒక్కసారి లైట్స్‌ ఆఫ్‌ అయిపోతే ఆమె కుర్చీ అటు, నా కుర్చీ ఇటు ఉండేది. ముఖ్యంగా  హిందీలో ‘మక్సద్‌’ అనే సినిమా ఇద్దరం కలిసి చేశాం. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో హీరో జితేంద్ర మమ్మల్ని కలిపేందుకు ట్రై చేశారు. మా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి బయట తాళం వేశారు. అలా గంట సేపు మమ్మల్ని ఒకే గదిలో ఉంచారు. కానీ, ఆ గంట సేపు ఇద్దరం మౌనంగా కూర్చున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేదు’ అని వివరించారు.

Also Read : జయలలిత రాజకీయ నాయకురాలు అవుతుందని తొలుత చెప్పిన హీరో ఎవరో మీకు తెలుసా?

Visitors Are Also Reading