యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొంత కాలంగా ప్రేమ ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్ల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
Advertisement
Advertisement
ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత పలు సినిమాలలో నటించాడు. కార్తీకేయ, స్వారారా వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ స్వయంభూ షూటింగ్ బిజీగా ఉన్నాడు నిఖిల్. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. తాజాగా నిఖిల్ కి కుమారుడు పుట్టడంతో చాలా సంతోషంగా ఉన్నాడు.
Also Read : దర్శకుడు కాళ్ళు మొక్కిన రాజమౌళి…!