Home » దర్శకుడు కాళ్ళు మొక్కిన రాజమౌళి…!

దర్శకుడు కాళ్ళు మొక్కిన రాజమౌళి…!

by Sravya
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజమౌళి బాహుబలి సినిమాతో పాపులర్ అయిపోయారు. తన రేంజ్ ని మరింత పెంచుకున్నారు రాజమౌళి రాజమౌళి కి అసలు ఓటమి తెలియదు. తెలుగు చిత్ర స్థాయిని విశ్వ వ్యాప్తంగా దర్శకుడు రాజమౌళి భారత్ నుండి తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాకి దర్శకుడిగా అరుదైన ఘనత దక్కించుకున్నారు రాజమౌళి. పాన్ ఇండియా స్థాయిలో హవా చూపిస్తున్న రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. అయితే మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా రాజమౌళి లాగే ఉండాలని అనిపించేలా రాజమౌళి తీరు ఉంటుంది.

rajamouli 1

Advertisement

కొంతమంది దర్శకులు కొన్నిసార్లు అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ రాజమౌళి మాత్రం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటారు ఏ స్థాయికి వెళ్ళినా సరే అలానే ఉంటారు తాజాగా రాజమౌళి క్యారెక్టర్ కి ప్రతిబింబించేలా ఒక సంఘటన మలయాళ ప్రొడ్యూసర్ చెప్పారు బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అల్లెపీ మార్గం ద్వారా శబరిమలై వచ్చారట ఆ టైంలో స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ తండ్రి మలయాళ దర్శకుడు ఫాజిల్ ని కలవగలరా అని రాజమౌళి అడిగారట.

Advertisement

అందుకు ఫాజిల్ కూడా ఓకే చెప్పారు దీంతో జక్కన్న ఆయనని కలవడానికి వెళ్లారు ఫాజిల్ మలయాళం లో మంచి సినిమాలని తెర మీదకి తీసుకువచ్చారు. ఫాజిల్ ను కలిసిన రాజమౌళి ఆయన పాదాలకి నమస్కరించారు దీంతో ఒక్కసారిగా ఫాజిల్ కూడా షాక్ అయ్యారు. దేశం అంతా బాహుబలి కోసం మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో రాజమౌళి తన కాళ్లు మొక్కడం ఏంటా అని ఆశ్చర్యపోయారు మలయాళ ప్రొడ్యూసర్ ఇటీవల ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. రాజమౌళి మిగతా దర్శకుల్ని రెస్పెక్ట్ ఇస్తారన్న విషయం తెలిసిందే.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading