Home » కేటీఆర్ కి దోరాహంకారం పోలేదు.. మండిపడ్డ ఆది శ్రీనివాస్..!

కేటీఆర్ కి దోరాహంకారం పోలేదు.. మండిపడ్డ ఆది శ్రీనివాస్..!

by Sravya
Ad

కేటీఆర్ కి దోరాహంకారం ఇంకా పోలేదు అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని శ్రీనివాస్ దర్శించుకున్నారు తర్వాత ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కేటీఆర్ కి మైండ్ బ్లాక్ అయింది అన్నారు. కరీంనగర్ లో కేటీఆర్ ఎమ్మెల్యే పై అసహనంతో మాట్లాడాలని అన్నారు. బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే చులకన అని మండిపడ్డారు. మీ దొరల ఎమ్మెల్యేగా ఉండాలా అని కోప్పడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భరతం పడతానంటే అర్థం ఏంటి అని మండిపడ్డారు కేటీఆర్ దళిత బీసీల వ్యతిరేకి అని నిప్పులు చెరిగారు.

Advertisement

Advertisement

ఇంకా కేటీఆర్ కి దోరాహంకారం పోలేదని అన్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మాట్లాడిన మాటల్ని ఉపసంహరించుకోవాలని అన్నారు అలానే ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకపోతే కేటీఆర్ కి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని అన్నారు పులి వస్తుందని కేటీఆర్ అంటున్నాడని గుర్తు చేశారు. పులి జనాల్లోకి వస్తే ఖచ్చితంగా బోన్ వేసేస్తాం అని ఇదివరకే మా సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీని అమలు చేస్తామని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading