ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ నిరుద్యోగులకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ని చెప్పింది ఇప్పటికే పలు శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు టీచర్ల నియామకాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల కోసం నోటిఫికేషన్ తీసుకువస్తామని చెప్పింది. ఈ ఏడాది ఆరు వేల నుండి పదివేల పోస్టులతో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం చూస్తోంది. సోమవారం విద్యా శాఖ మంత్రి బొత్స నారాయణ సత్యనారాయణ విద్యా శాఖ అధికారుల తో డీఎస్సీ పై కీలక సమావేశాన్ని నిర్వహించారు.
Advertisement
Advertisement
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు సేకరించారు. విద్యా శాఖ లో 18,500 పోస్టులు ఉన్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చెప్పింది ఏపీ లో ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరుద్యోగులు చూస్తున్నారు. పది రోజుల క్రితం డిఎస్సి నోటిఫికేషన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదిక గా డిఎస్సి నోటిఫికేషన్ పై వివరాలని బొత్స సత్యనారాయణ వెల్లడించారు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి తర్వాత శుభవార్త తెలియజేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!