ప్రస్తుతం భారత్ టీమ్ దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి చెందింది. ఈ రోజు నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ భవితవ్యం పై మాట్లాడుతూ.. టెస్ట్ ఫార్మాట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇది ఒకటి రెండు దేశాలతో సాధ్యం కాదని టెస్ట్ ఆడే దేశాలన్నీ బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.
అభిమానులను అలరించాల్సిన బాధ్యత క్రికెటర్ల పై ఉందని కూడా రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం ఇవే వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ వా కూడా అన్నారు. ఐసీసీ, బీసీసీఐ సహ ప్రపంచ బోర్డులు టెస్ట్ ఫార్మాట్ ని పరీక్షించాలని పిలుపునిచ్చారు. కాగా తాజాగా ఇప్పుడు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ పై కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఒకప్పుడు టెస్ట్ ఫార్మాట్ మ్యాచ్ లకి జనాలు ఎగబడి చూసేవారు.
Advertisement
అయితే ఎప్పుడైతే T-20 మ్యాచ్ లు ప్రారంభమయ్యాయో టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తి మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. టెస్ట్ మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని దేశాలు టెస్ట్ మ్యాచ్ లని పూర్తిగా నిషేధించే విధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు మాజీ ఆటగాళ్లు ప్రస్తుతం ఆడుతున్న స్టార్ ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ ను కాపాడాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ చేశారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.