తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని చేయచ్చని చెప్పారు. టిఎస్ఆర్టిసి ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకం అమలు అవుతుంది. తాజాగా ఆదివారం రోజున ఒక కండక్టర్ మహిళకి టికెట్ తీసుకున్న ఘటన వెలుగు చూసింది.
Advertisement
నిజామాబాద్ నుండి బోధన్ వెళుతున్న బస్సులో ఒక మహిళకి టికెట్ కొట్టాడు కండక్టర్. ఉచిత బస్సు పథకం ఉందని చెప్పినా కండక్టర్ వినిపించుకోలేదు. ఆ కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి, సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లారు.
Advertisement
ఎండి సజ్జనార్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు విచారణకి ఆదేశించి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక మహిళకి టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకి ఆదేశించాము. విచారణ తర్వాత ఆయనపై చర్యలని తీసుకుంటామని సజ్జనార్ చెప్పారు. ఆ కండక్టర్ ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!