Home » YS Sharmila : జగన్ ప్యాలెస్ లోనే వైఎస్‌ షర్మిల కొడుకు పెళ్లి.. కట్నం ఎంతంటే ?

YS Sharmila : జగన్ ప్యాలెస్ లోనే వైఎస్‌ షర్మిల కొడుకు పెళ్లి.. కట్నం ఎంతంటే ?

by Bunty
Published: Last Updated on
Ad

వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన కుమారుడు షర్మిల రాజారెడ్డి వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. రాజారెడ్డి అమెరికాలో తన చదువు కోసం వెళ్లగా…. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కమ్మ వర్గానికి చెందిన ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించాడు. అలా నాలుగేళ్ల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబసభ్యులకు చెప్పడంతో కుటుంబసభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ys-sharmial-son

Advertisement

 

అయితే త్వరలోనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇక వివాహానికి తక్కువ సమయం ఉండడంతో ఇప్పటికే వీరి పెళ్లి పనులను ప్రారంభించారట. షర్మిల తన కొడుకు రాజారెడ్డి వివాహం కోసం జగన్ తో సంప్రదింపులు జరిపించారట. గతంలో అన్నా చెల్లెళ్లకు ఆస్తుల విషయంలో గొడవలు జరిగి మాటలు లేకుండా పోయాయి. ఇక కుమారుడి వివాహం కారణంగా జగన్ తో మళ్లీ మాట్లాడుతున్నారట షర్మిల. ఇక తన చెల్లెలు ఇంటికి వచ్చి చెప్పడంతో జగన్ కూడా వివాహ పనులను తన చేతుల మీదుగా జరిపించాలని అనుకుంటున్నారట.

YS Sharmila’s Son To Marry Priya Atluri

తనకు కొడుకులు లేని కారణంగా చిన్ననాటి నుంచి అతన్నే కొడుకుగా అనుకున్నారట జగన్. ఇక జగన్ బెంగుళూరులో ఉన్న తన ప్యాలెస్ లో రాజారెడ్డి వివాహాన్ని జరిపించాలని అనుకుంటున్నారట. ఇక రాజారెడ్డి వివాహానికి దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. ఇక వివాహ కారణంగా అన్నా చెల్లెలు మళ్లీ కలిసిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading