Home » తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 91,147 ఉద్యోగాలు ఖాళీలు..!

తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 91,147 ఉద్యోగాలు ఖాళీలు..!

by Anji
Ad

తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయ‌న్నారు. వీటిని ఇవాల్టి నుంచే నోటిఫై చేస్తున్నామ‌న్నారు. అందులో 80,039 ఉద్యోగాల‌కు ఇవాళ్టి నుంచే శాఖ‌ల వారిగా నోటిఫికేష‌న్లు వ‌స్తాయ‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.


అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పోలీస్ శాఖ‌లో 18,334, విద్యాశాఖ‌లో 13,086, ఉన్న‌త విద్యాశాఖ‌లో 7,878, రెవెన్యూ శాఖ‌లో 3,560, వైద్యారోగ్య శాఖ‌లో 12,755, బీసీ సంక్షేమ శాఖ‌లో 4,311 సాగునీటి శాఖ‌లో 2,692, ఎస్సీ సంక్షేమ శాఖ‌లో 2,879, ట్రైబ‌ల్ వెల్పేర్‌లో 2,399 ఖాళీలున్నాయి. మ‌రొక‌వైపు తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి వ‌యోప‌రిమితి పెంచుతున్న‌ట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

Advertisement

Advertisement

జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితి 44 ఏళ్ల‌కు పెంచ‌గా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు 49 ఏళ్లు.. దివ్యాంగుల‌కు 54 ఏళ్లు వ‌యోప‌రిమితిగా ఉంటుంద‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ముఖ్యంగా 95 శాతం రిజ‌ర్వేష‌న్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ‌తంలో గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు లోక‌ల్ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించేది కాద‌ని.. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి అనుమ‌తితో లోక‌ల్ రిజ‌ర్వేష‌న్ తీసుకొచ్చామ‌ని వెల్ల‌డించారు. స్థానిక అభ్య‌ర్థులు జిల్లా, మ‌ల్టీజోన్ల‌లో ఉద్యోగాల‌కు పోటీ ప‌డ‌వ‌చ్చు. జిల్లా క్యాడ‌ర్‌, జోన‌ల్ పోస్టుల‌కు అవ‌కాశం ఉంది. 7 జోన్లు, 33 జిల్లాల‌లో ఉద్యోగ నియామ‌కం చేప‌ట్ట‌డం వ‌ల్ల నిరుద్యోగ స‌మ‌స్య తీరుతుందని కేసీఆర్.

Also Read :  అనసూయ ట్వీట్.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్ ఇవే..!

Visitors Are Also Reading