Home » Anchor Anasuya: అనసూయ ట్వీట్.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్ ఇవే..!

Anchor Anasuya: అనసూయ ట్వీట్.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్ ఇవే..!

by Anji
Ad

Anchor Anasuya: యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై ఈ యాంక‌ర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓ వైపు బుల్లితెర‌పై అల‌రిస్తూనే మ‌రొక వైపు వెండితెర‌పై కూడా స‌త్తా చాటుతుంది అన‌సూయ‌. ఇటీవ‌లే అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమాలో దాక్షాయ‌ణి పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఓ వైపు బుల్లితెర‌పై షోలు చేస్తూనే మ‌రొక‌వైపు వెండితెర‌పై స‌త్తా చాటుతుంది. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలోనూ అన‌సూయ ఫుల్ యాక్టివ్.. ఎప్పుడూ లేటెస్ట్ ఫొటోస్ సినిమా అప్‌డేట్ షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

 

అదేవిధంగా అన‌సూయ‌కు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు. ఇప్ప‌టికీ ఎన్నోసార్లు ప్ర‌తి విష‌యంలోనూ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు. ఇప్ప‌టికీ ఎన్నోసార్లు ప్ర‌తి విష‌యంలోనూ ఆమెను ట్రోల్ చేస్తుంటారు నెటిజ‌న్స్‌. ఇక తాను ట్రోల్ చేసే వారికి త‌న‌దైన స్టైల్‌లో గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తుంది అన‌సూయ‌. తాజాగా ఉమెన్స్ డే పై అన‌సూయ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఈరోజు ట్రోల‌ర్స్ మీమ్ మేక‌ర్స్ అంద‌రూ కూడా మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తున్నారు. ఇది 24 గంట‌ల్లోనే ముగుస్తుంద‌ని తెలుసు. అందుకే మ‌హిళ‌లంద‌రికీ హ్యాపీ పూల్స్‌డే అంటూ ట్వీట్ చేసింది. అన‌సూయ ఇంకేముంది అన‌సూయ చేసిన ట్వీట్‌తో ఆమెపై ట్రోలింగ్ మొద‌లైంది. మ‌థ‌ర్ థెరిస్సా మెరీ కోమ్ వంటి వారిపై ఎవ్వ‌రూ ట్రోల్ చేయ‌రని.. మ‌నం చేసే ప‌నుల ద్వారానే మ‌న‌కు గౌర‌వం ద‌క్కుతుంద‌ని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త‌న గురించి వ‌స్తున్న కామెంట్లు చూసిన అన‌సూయ‌.

Also Read :  Video Viral : దివ్యాంగ అభిమానికి బ‌హుమ‌తి అందజేసిన విరాట్ కోహ్లీ

మ‌రొక సారి ట్రోల్స్ చేసే వారి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. గుమ్మ‌డి కాయ దొంగ‌లు వ‌చ్చారు. నా ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. మ‌రొక ట్వీట్ చేసింది అన‌సూయ‌. తాజాగా ఆమె చేసిన ట్వీట్ పై కూడా నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. అన‌సూయ తెర‌పై క‌నిపించే విధానం.. మాట‌ల‌ను గుర్తు చేస్తున్నారు. బుల్లితెర‌పై చేసే షోల‌లో మ‌హిళ‌ల‌పై కామెంట్స్ చేస్తే న‌వ్వుతుంటారు. కానీ ఇప్పుడు ఎందుకు గుర్తుకురావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. త‌న గురించి కామెంట్స్ చేసే వారిని అన‌సూయ బ్లాక్ చేస్తూ వ‌స్తోంది. దీంతో అన‌సూయ బ్లాక్ చేస్తుందంటూ మ‌ళ్లీ కామెంట్స్ ప్రారంభించారు. అన‌సూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ర‌చ్చే జ‌రుగుతూ ఉంది.

 

 

 

 

Visitors Are Also Reading