Home » పిల్లల ముందు… తల్లిదండ్రులు అసలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా?

పిల్లల ముందు… తల్లిదండ్రులు అసలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా?

by Bunty
Ad

సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకుంటూ మరియు తిట్టుకుంటారు. దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి, పిల్లల ముందు అలా చేయకూడదు. పిల్లల ముందు ఈ ఐదు పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

# క్రమశిక్షణ రాహిత్యం

Advertisement

ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువుల తల్లిదండ్రులు కాబట్టి, తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణకు తీసుకొని మెదులుతూ ఉంటారు.

 

# అబద్ధం చెప్పడం

చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలను అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

# తప్పుడు పదాలు మాట్లాడకూడదు. సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ తప్పుడు పదాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా పెద్దవారి మాటలని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు అవి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

# పిల్లల ముందు అవమానించరాదు. దంపతుల మధ్య గొడవ లు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీ లు చెప్పుకుంటూ దెబ్బలాడుతూ ఉంటారు. ఈ సమయంలో భర్త భార్యను అవమానిస్తారు. అలాగే భార్య భర్తను అవమానిస్తుంది. ఇదంతా పిల్లల ముందే చేయడం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి.

# అసభ్య ప్రవర్తన

పిల్లల ముందే భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు. అంటే వారి ముందే ఒకళ్ళ ను ఒకరు పట్టుకోవడం లాంటివి చేయడం వల్ల పిల్లలకు కూడా అదే మైండ్ లో ఉండిపోతుంది.

READ ALSO : చిరంజీవి అంత పెద్ద తప్పు చేశాడా ? తన అల్లుళ్ళకి అలాంటి కండిషన్స్ పెట్టి టార్చర్‌ పెట్టేశాడా ?

Visitors Are Also Reading