Home » ‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!

‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!

by Bunty
Published: Last Updated on
Ad

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏగబడి చూశారు. కన్యాదానం, ఉపేంద్ర, రా, ఒకే మాట లాంటి ఉపేంద్ర నటించిన ఎన్నో చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. హీరోగానే కాకుండా సన్నాఫ్ సత్యమూర్తి, గని లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉపేంద్ర తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తెలుగులో చాలాకాలంగా కనిపించిన ఉపేంద్ర క్రేజ్ మళ్లీ కబ్జా సినిమాతో కనిపించింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమాపై నెగటివ్ రావడానికి 5 కారణాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

Advertisement

కేజిఎఫ్ లో జర్నలిస్టు తాత, రాఖీ బాయ్ స్టోరీ చెబుతుంటే మనకు ప్రతి సీనులో గూస్ బంప్స్ వస్తుంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి చోట కనెక్ట్ అవుతాం. అది ఏ చోట ఈ సినిమాలో కనిపించదు. కమిషనర్ భార్గవ్ భక్షి, డాన్ ఆర్కేశ్వర్ గురించి ఎలివేషన్స్ ఇచ్చి మరి చెబుతుంటారు. కానీ ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎప్పుడు వస్తుందో అసలు అర్థం కాదు. దానికి తోడు విలన్ పాత్రలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ల పేర్లు మరింత కన్ఫ్యూజ్ చేసేస్తాయి. అవి గుర్తుంచుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. పోనీ స్టోరీ బాగుందా అంటే నీరసంగా, చప్పగా సాగుతూ ఉంటుంది.

Advertisement

Read Also : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

Kabzaa Review in Telugu

ఏ పాయింట్ లోనూ అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయదు. కేజిఎఫ్ స్టైల్లో సినిమా తీయాలనుకోవడంలో తప్పులేదు. కానీ స్టోరీలో డెప్త్ తో పాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటే ప్రేక్షకులు కేజీఎఫ్ ని మించి ఆదరిస్తారు. చెప్పాలంటే ఆ సినిమాను ఈజీగా మర్చిపోతారు. కబ్జా టీం ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఒక్కచోట కూడా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయలేకపోయింది. తెలుగు, కన్నడ నుంచి మురళీ శర్మ, సుధతో పాటు చాలామంది సీనియర్ యాక్టర్స్ ని తీసుకున్నప్పటికీ ఒక్కరిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఎంతసేపు హీరోకి ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, ఎమోషనల్ సీన్ లో దబాదబా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవడం తోనే సరిపోయింది. చూస్తున్న మీరు కచ్చితంగా కొన్ని సీన్లలో అయినా తలపట్టేసుకోవడం గ్యారెంటీ.

READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

Visitors Are Also Reading