వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో వేలు పెడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ పెడుతూ.. వార్తల్లో నిలుస్తారు. ముఖ్యంగా టిడిపి నేతలను రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేస్తూ ఉంటారు.
read also : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!
Advertisement
అయితే, తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన ఆర్జీవి బిటెక్ డిగ్రీ పట్టాన్ని అందుకున్నాడు. 37 ఏళ్ల తర్వాత పట్టా అందుకోవడం థ్రిల్ గా ఉందంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఆర్జీవి తనకు నాగార్జున యూనివర్సిటీ అధికారులు డిగ్రీ పట్టా ఇస్తున్న ఫోటోను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Advertisement
‘బీటెక్ పాస్ అయిన 37 ఏళ్ల తర్వాత నా డిగ్రీ పట్టాన్ని అందుకోవడం సూపర్ థ్రిల్ గా ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేయాలని ఆసక్తి నాకు లేదు. అందుకే 1985 నుంచి నా డిగ్రీ పట్టాన్ని తీసుకోలేదు. థాంక్యూ,’ రాసుకొచ్చాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా తోలుతా వైరల్ అయ్యి ఆ తర్వాత కాంట్రవర్సీ అవుతుంది. ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవి వాక్యాలు అలాంటి దుమారాన్నే లేపుతున్నాయి.
READ ALSO : NTR నుంచి మనోజ్ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్లు ?