Home » 31st march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

31st march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

దేశంలో పెట్రోల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 115.42 గా ఉండ‌గా…. డీజిల్‌ ధర రూ. 101.58 గా ఉంది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 117.32 ఉండ‌గా డీజిల్‌ ధర రూ. 103.10 గా ఉంది.

Advertisement

నేడు శ్రీశైలంలో 2వరోజు ఉగాది మహోత్సవాలు జ‌రుగుతున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నుంది. కైలాసవాహనంపై ఆది దంపతులు ప్ర‌త్యేకపూజ‌లు అందుకోనున్నారు.

ఏపీలో టోల్‌ ప్లాజా టికెట్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెరిగిన ధ‌రలు అమలులోకి వ‌స్తున్నాయి.

తెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల రాయతీ గడువును పొడిగించారు. చలాన్లపై రాయితీని ఏప్రిల్‌ 15వ తేదీ వరకు తెలంగాణ హోంశాఖ పెంచుతూ నిర్నయం తీసుకుంది. పెండింగ్‌ చలాన్ల ద్వారా ఇప్పటి వరకు రూ.250 కోట్లు వసూలు చేశారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

ఏపీలో నేడు వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని వామ‌ప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

శ్రీలంక‌లో దుర్భ‌ర ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఆర్థిక‌, ఇంధ‌న సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయింది. కాగితం కొర‌త‌తో ప‌రీక్ష‌లు ఆగిపోయాయి..అంతే కాకుండా పెట్రోల్ కోసం క్యూ క‌ట్టి జ‌నాలు స్పృహ కోల్పోతున్నారు.

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో హ‌టాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆత్మ‌కూరులో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక‌లో గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణి శ్రీకీర్తిని బ‌రిలోకి దింపే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం రాట్లాం జిల్లాలో వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ మ‌హిళ‌కు ఇద్ద‌రు క‌వ‌ల‌లు జ‌న్మించ‌గా రెండు త‌ల‌ల మ‌ధ్య‌లో నుండి ఒక‌చేయి వ‌చ్చింది.

తెలంగాణ‌లో ఎండ‌లు భ‌గ్గుమంటున్నాయి. దాంతో ఎప్రిల్ 24 నుండి ప‌ద‌కొండున్న‌ర వ‌ర‌కే ఒంటిపూట బ‌డులు న‌డిపించ‌నున్నారు.

Visitors Are Also Reading