Home » 25th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

25th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రేపటి నుంచి ఐపీఎల్‌-15 సీజన్‌ ప్రారంభం కానుంది. ముంబై వేదికగా రేపు రాత్రి 7.30 గంటలకు చెన్నై-కోల్‌కతా మధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మ‌ళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.91 గా ఉండ‌గా డీజిల్ ధ‌ర‌ రూ.97.23 గా ఉంది. ఇక‌ విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.76 గా ఉండ‌గా డీజిల్‌ రూ.98.74 గా ఉంది.

Advertisement

నేడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సూర్యాపేటకు త్వరలో ఐటీ హబ్ రాబోతుంది. ఐటీ హ‌బ్ ఏర్పాటుకు గ్లోబ‌ల్ ఐటీ సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయ‌ని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటీ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు.

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.91, డీజిల్‌ రూ.97.23.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.76, డీజిల్‌ రూ.98.74 గా ఉంది.

మ‌ద్రాసు హైకోర్టు అడిష‌న‌ల్ జ‌డ్జిగా శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా నియ‌మితుల‌య్యారు. న్యాయ‌వాదుల కోటాలో సుప్రీంకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయ‌మూర్తుల పేర్లను సిఫార‌లు చేసింది. కాగా ఇద్ద‌రి పేర్లను రాష్ట్ర‌ప‌తి కోవింద్ ఆమోదించారు.

ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమా 14 రోజుల్లోనే రికార్డు క‌లెక్ష‌న్ లు రాబ‌ట్టింది. రూ.200 కోట్ల‌ను ఈ సినిమా క‌లెక్ట్ చేసింది.

ఉక్రెయిన్ ర‌ష్యా యుద్దం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మే 9న ర‌ష్యా విజ‌యోత్స‌వ దినం సంధ‌ర్భంగా అదే రోజున యుద్దాన్ని ముగించాల‌ని ర‌ష్యా నిర్న‌యం తీసుకుంది.

యూపీలో త‌ప్పించుకుని తిరుగుతున్న అత్యాచార నింధితుడి ఇంటికి అధికారులు బుల్డోజ‌ర్ ను పంపించారు. దాంతో గ‌త్యంత‌రం లేక నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Visitors Are Also Reading