ప్రతి ఏడాది కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకుంటాయి. అలా మనసుదోచుకున్న సినిమాల కోసం నెటిజన్లు గూగుల్ ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటారు. సినిమా పాటలు టీజర్.. ట్రైలర్ …సినిమా విడుదల తరవాత రివ్యూలు మరియు కలెక్షన్లు ఇలా చాలా విషయాల గురించి నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. అలా ఈ ఏడాది ఇండియాలో కొన్ని సినిమాల గురించి ఎక్కువ సెర్చ్ చేశారు.
Advertisement
ఆ డేటాను గూగుల్ విడుదల చేసింది. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా బ్రహ్మాస్త్ర సినిమా గురించి వెతికారు. అంతే కాకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి కూడా గూగుల్ లో ఎక్కువగా వెతికారు.
రీసెంట్ బ్లాక్ బస్టర్ కాంతార సినిమా గురించి కూడా నెటిజన్లు ఈ ఏడాది ఎక్కువగా వెతికినట్టు తెలుస్తోంది. కాంతార కన్నడ సినిమా అయినప్పటికీ ఇండియా వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది.
Advertisement
కన్నడ సినిమా కేజీఎఫ్ పార్ట్ 2 ను కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ సినిమా టాప్ 2 లో నిలిచింది. బాలీవుడ్ సినిమా కశ్మీర్ ఫైల్స్ పై కేంద్రం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాప్ 3 లో నిలిచింది. టాలీవుడ్ లో తెరకెక్కిన పుష్ప కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read: బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన షర్టు ఖరీదు ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా గూగుల్ సెర్చ్ లో టాప్ 6 లో నిలిచింది. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా గూగుల్ సెర్చ్ లో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా ను కూడా గూగుల్ లో ఎక్కువగా వెతికారు. ఈ సినిమా గూగుల్ సెర్చ్ లో 8వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ నటించిన దృశ్యం 2 కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా టాప్ 9 లో నిలిచింది. అంతే కాకుండా గూగుల్ సెర్చ్ లో టాప్ 10 లో థార్ సినిమా నిలిచింది.
Also Read: అఖండ సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ? చూసుకోవాలిగా బోయ పాటి గారు అంటూ ట్రోల్ల్స్ ..!