హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రజల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. తాజాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దోమలగూడ, లేక్ పోలీస్ స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తార్బన్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలిచౌకి, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
Advertisement
ఆరు జోన్లలో జోన్ కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మారేడుపల్లి, బోయినపల్లి, జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, చిలకలగూడ, బహదూర్పుర, సంతోష్ నగర్, చాంద్రాయన గుట్ట, టోలిచౌకి, లంగర్ హౌస్లలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇక త్వరలోనే కొత్త పోలీస్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లు సిబ్బందిని కూడా నియమించనున్నారు.
Advertisement
విస్తీర్ణం, జనాభా కేసుల సంఖ్య ఆధారంగా గతంలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఇప్పుడు స్టేషన్ల పరిధిలో జనసాంద్రత బాగా పెరిగిపోయింది. దీంతో ఫిర్యాదులు, కేసుల సంఖ్య సైతం ఎక్కువైపోయి పోలీసుల విధుల్లో ఇప్పుడు భాగమైపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు ఆదనపు పనిబారం సహా అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. వాటిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మహానగర పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు.
READ ALSO : మాములు ప్రజలే కాదు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా EMI కట్టాల్సిందే.. రోజుకు ఎంత కడుతుందటే ?