Home » అంజి, ఆచార్య స‌హా చిరు కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 20 సినిమాలు ఇవే..!

అంజి, ఆచార్య స‌హా చిరు కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 20 సినిమాలు ఇవే..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. చిరు గాడ్ ఫాద‌ర్ సినిమాతో మ‌రో సూప‌ర్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలే చిరంజీవిని మెగాస్టార్ గా మార్చాయి. ఇక చిరు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌తో పాటూ కొన్ని డిజాస్ట‌ర్ లు కూడా ఉన్నాయి. ఆ డిజాస్ట‌ర్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….గాడ్ ఫాద‌ర్ సినిమా కంటే ముందు చిరంజీవి కొర‌టాల కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆచార్య డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ఈ సినిమాతో ప్రొడ్యూస‌ర్ ల‌కు భారీ న‌ష్టాలు వ‌చ్చాయి. 2004లో కోడిరామకృష్ణ ద‌ర్శ‌కత్వంలో చిరంజీవి హీరోగా న‌టించిన అంజి సినిమా కూడా దారుణ‌మైన ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌గా నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి కోట్ల రూపాయల‌ను న‌ష్ట‌పోయారు. శంక‌ర్ దాదా జిందాబాద్ కూడా చిరు కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ హిట్ అవ్వ‌డంతో దానికి సీక్వెల్ గా శంక‌ర్ దాదా జిందాబాద్ తెరకెక్కించారు.

Advertisement

కానీ ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లోని మ‌రో డిజాస్ట‌ర్ సినిమా మృగ‌రాజు. ఈ సినిమాను హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా భారీ అంచ‌నాల న‌డుమ తెర‌కెక్కించారు. కానీ ఈ సినిమా అంచ‌నాలు రీచ్ కాలేక ఫ్లాప్ అయ్యింది. చిరంజీవి రోజా హీరో హీరోయిన్ లుగా బిగ్ బాస్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూట‌గట్టుకుంది.

ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా వ‌చ్చిన ఎస్పీ ప‌ర‌శురాం సినిమా కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి ఫ్లాప్ అయ్యింది. మెగాస్టార్ విజ‌య‌శాంతి కాంబోలో స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్ అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కూడా చిరు కెరీర్ లో ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఈ సినిమాల‌తో పాటూ చిరు హీరోగా న‌టించిన ఆరాధ‌న‌, లంకేశ్వ‌రుడు, చ‌క్ర‌వ‌ర్తి, రాజావిక్ర‌మార్క‌,యుద్ద‌భూమి, జేబుదొంగ‌, వేట‌, చిరంజీవి, ధైర్య‌వంతుడు, కిరాత‌కుడు, త్రినేత్రుడు సినిమాలు సైతం చిరు కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి.

Visitors Are Also Reading