Home » ఎన్టీఆర్ చంద్ర‌బాబుల మ‌ధ్య 1995లో ఏం జ‌రిగింది..? సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు అలా ఎందుకు అన్నారు..?

ఎన్టీఆర్ చంద్ర‌బాబుల మ‌ధ్య 1995లో ఏం జ‌రిగింది..? సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు అలా ఎందుకు అన్నారు..?

by AJAY
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే టాక్ షో విజ‌య‌వంతంగా ఒక‌టో సీజ‌న్ పూర్తిచేసుకుని రెండో సీజ‌న్ లో అడుగుపెట్టింది. రెండో సీజ‌న్ లో మొద‌ట గెస్ట్ గా చంద్ర‌బాబు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు ఎపిసోడ్ కు మిలియన్స్ కొద్ది వ్యూవ్స్ వ‌స్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో చంద్ర‌బాబు తో పాటూ లోకేష్ కూడా పాల్గొన్నాడు. కాగా ఈ షోలో బాల‌య్య చంద్ర‌బాబును మీ జీవితంలో అతిపెద్ద నిర్న‌యం ఏంటి అని ప్ర‌శ్నించాడు. దానికి ఎన్టీఆర్ స‌మాధానం ఇస్తూ…1995లో జ‌రిగింది అని చెప్పారు.

Advertisement

ఆ సంవ‌త్స‌రంలో ల‌క్ష్మీపార్వ‌తిని సాకుగా చూపించి చంద్ర‌బాబు ఎన్టీఆర్ ను త‌ప్పించి తాను సీఎం కుర్చీపై కూర్చున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరోపిస్తునే ఉన్నాయి. ఈ క్ర‌మంలో షోలో వెన్నుపోటు అంశంపై చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అంతే కాకుండా బాల‌య్య‌ను కూడా మ్యాట‌ర్ లోకి లాగుతూ ఆరోజు నేను చేసింది త‌ప్పా అని ప్ర‌శ్నించారు.

Advertisement

నేను ఎన్టీఆర్ కాళ్లు కూడా పట్టుకున్నాన‌ని కానీ ఆయ‌న విన‌లేదని అన్నారు. బాల‌య్య మాట్లాడుతూ నాకు ఆరోజు ఇంకా గుర్తుంది బావా అంటూ స‌మాధానం ఇచ్చారు. అంతే కాకుండా త‌మ ఫ్యామిలీ చంద్ర‌బాబు వెంట‌నే ఉంద‌ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంట‌ర్వ్యూలో చంద్రబాబు ఎన్టీఆర్ ను త‌న గుండెల్లో పెట్టుకున్నాన‌ని చెప్పారు. ఇదిలా ఉంటే చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌త‌ర్వాత సెప్టెంబ‌ర్ 1న ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ కు నైతిక‌విలువ‌లు లేవంటూ వ్యాఖ్యానించారు.

ఆ విష‌యాన్ని ఎన్టీఆర్ అభిమానులు కొంత‌మంది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ను బాధించిన విష‌యాల‌లో ఒక‌టి ఆయ‌న‌పై చెప్పులు విస‌ర‌డం…ఆ పని చేయించింది ఎవ‌రని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు అభిమానులు చంద్ర‌బాబు తీసుకున్న నిర్న‌య‌మే స‌రైంద‌ని పార్టీలో, ప్ర‌భుత్వంలో ల‌క్ష్మీపార్వ‌తి పెత్త‌నం చూడ‌లేక‌నే బాబు ఎన్టీఆర్ ను గ‌ద్దె దింపారని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading