Home » 1982 నాటి సినిమా విడుదల కాబోతోంది.. ఏంటంటే..?

1982 నాటి సినిమా విడుదల కాబోతోంది.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోతున్నాయి.. మరికొన్ని షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత కూడా విడుదలకు నోచుకోలేదు.. కొన్ని సినిమాలు థియేటర్లలోకి రాలేక నేరుగా ఓటిటి వంటి ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేస్తున్నారు.. ఇలాంటి తరుణంలో 40 ఏళ్ల కింద నిర్మించిన ఒక సినిమా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది..

Advertisement

1982 లో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు హీరోయిన్ గా జయసుధ నటించిన ప్రతిబింబాలు అనే మూవీ అప్పట్లో ఏదో ఒక కారణాల వల్ల విడుదల కాలేదు.. ప్రస్తుతం ఆ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అలనాటి హీరో అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయడం కోసం నిర్మాత రాధాకృష్ణ ప్రకటించారు.. ఈ మూవీని థియేటర్లలోనే విడుదల చేస్తాం అంటూ ఆయన తెలిపారు..

Advertisement

ఏఎన్ఆర్ సినిమాలు థియేటర్ లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది.. కనుక ఈ మూవీను విడుదల చేస్తే అక్కినేని అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.. ఈ సినిమాకు సంగీతం అందించింది చక్రవర్తి, ఇందులో గుమ్మడి, కాంతారావు వంటి సీనియర్ నటులు కూడా నటించారు. 40 ఏళ్ల కింద సినిమా కాబట్టి ప్రస్తుతం ఉన్న యువత అలనాటి సినిమా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో అని ఈ సినిమాను చూసి ఓసారి ఆ అనుభూతిని పొందండి.

ALSO READ;

Visitors Are Also Reading