Home » ఆ స్టార్ డైరెక్టర్ ఆ హీరోయిన్ పట్ల అలా ప్రవర్తిస్తున్నారా.. బయటకు వచ్చే ఛాన్సే లేదా..!!

ఆ స్టార్ డైరెక్టర్ ఆ హీరోయిన్ పట్ల అలా ప్రవర్తిస్తున్నారా.. బయటకు వచ్చే ఛాన్సే లేదా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడు ఎవరు స్టార్ హోదాకు వెళ్ళిపోతారో చెప్పలేం.. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ అవ్వలేరు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసి స్టార్ హీరో హీరోయిన్లు గా ఎదిగి వారి టాలెంట్ ను నిరూపించుకుంటారు.. ఆ కోవకే చెందింది ఈ హీరోయిన్. అయితే కొంతమంది హీరో హీరోయిన్ల టాలెంట్ ను గుర్తించిన దర్శకనిర్మాతలు వారికి వారే అవసరం అనుకుంటే వారి డేట్స్ ని లాక్ చేస్తూ ఉంటారు.. ఉదాహరణకు పటాస్ సినిమా తో అనిల్ రావిపూడి దర్శకుడిగా వచ్చారు. అయితే ఆయన పైన నమ్మకంతో కళ్యాణ్ రామ్ వెంటనే రెండు సినిమాలు వారి బ్యానర్లలో చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు..

Advertisement

ఆ తర్వాత అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు కళ్యాణ్ రామ్ ని ఎలాగైనా ఒప్పించి అనిల్ రావిపూడిని తన బ్యానర్ లోకి తీసుకెళ్లారు.. ఈ విధంగా అనిల్ రావిపూడి రెండు నుంచి మూడు సినిమాలు కళ్యాణ్ రామ్ కు చేయాల్సి ఉన్నా కానీ దిల్ రాజు కు చేసేసాడు. దీనికి సంబంధించి వారి మధ్య అగ్రిమెంట్లు కూడా ఉన్నాయట.. ఒకవేళ అగ్రిమెంట్ తప్పినట్లయితే డబ్బులు కూడా కట్టేలా వారు రాయించుకున్నారు.. ఈ అగ్రిమెంట్ అనేది ఒక్కోసారి నటీనటులకు ప్లస్ కావచ్చు లేదంటే మైనస్ కూడా అవ్వచ్చు. ఈ విధంగానే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ డైరెక్టర్ దగ్గర అగ్రిమెంట్ చేసి ఇబ్బందుల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా అనిల్ సుంకర నిర్మిస్తున్న మూవీ ఏజెంట్. ఇందులో కథానాయిక సాక్షి వైద్య.. తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు ఇది మొదటి సినిమా..

Advertisement

ఇప్పటికే ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దీంతో ఆమె హీరోయిన్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు దర్శక నిర్మాతలు ఆమెను సినిమాల్లోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నారట.. కానీ ఆమె ఏజెంట్ మూవీకి 30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకొని లాక్ అయిపోయింది.. కానీ ఆమెకు కొంత మంది దర్శక నిర్మాతలు కోటిరూపాయల వరకు పారితోషికం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ ఆమె దురదృష్టం ఏంటంటే.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమె డేట్స్ ఆల్రెడీ లాక్ చేసేసారు. ఏజెంట్ మూవీ రిలీజ్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని, అలాగే ఇంకో సినిమా చేయాలనుకుంటే అది నాతోనే చేయాలని అగ్రిమెంట్ రాయించుకున్నారట సాక్షి వైద్య తో.. ఇప్పుడు ఆమెకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్లు వస్తున్నా కానీ అగ్రిమెంట్ దాటి బయటకు వెళ్ళే పరిస్థితి లేక చాలా ఇబ్బంది పడుతోంది.

ALSO READ;

నాగబాబుకు తెలియకుండా నిహారిక ఇంత పని చేసిందా.. కోపంతో రగిలిన నాగబాబు ఏం చేశారంటే..?

ప్ర‌భాస్ విష‌యంలో ఆ నిర్మాత వెనుక‌డుగు వేయ‌డానికి కారణం అదేనా..?

 

Visitors Are Also Reading