Home » హీరో సుమ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

హీరో సుమ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణించిన‌వారిలో హీరో సుమ‌న్ కూడా ఒక‌రు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించి సుమన్ స్టార్ హీరోగా ఎదిగాడు. అంతే కాకుండా సుమన్ చిరంజీవికి సైతం పోటీ ఇచ్చారు. సుమ‌న్ ఓ కేసులో జైలుకు వెళ్లారు కానీ లేదంటే ఇప్ప‌టికీ ఆయ‌న స్టార్ హీరోగా రాణించేవారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓ ప్ర‌ముఖ రాజ‌కీయనాయుకురాలు కుట్ర‌ప‌న్ని త‌న‌ను జైలు పాలు చేసింద‌ని సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

Advertisement

ఆ కేసు నుండి బ‌య‌ట‌ప‌డిన త‌ర‌వాత కూడా సుమ‌న్ సినిమాలు చేశారు కానీ అవి ఆశించిన‌మేర విజ‌యం సాధించ‌లేదు. అంతే కాకుండా జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌ర‌వాత సుమ‌న్ కు పెద్ద‌గా ఆఫ‌ర్ లు కూడా రాలేదు. ఆ త‌రవాత సుమ‌న్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. పాజిటివ్ నెగిటివ్ రోల్స్ లో న‌టించారు. ఇప్ప‌టికీ సుమ‌న్ సినిమాల్లో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

ఇక సుమ‌న్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి అతికొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. సుమ‌న్ ప్ర‌ముఖ ర‌చ‌యిత డివి న‌ర్స‌రాజు మ‌న‌వ‌రాలు శిరీష తల్వార్ ను వివాహం చేసుకున్నారు. ఆ దంప‌తుల‌కు ఓ కూతురు ఉంది అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. సుమ‌న్ కూతురు పేరు అఖిలజ‌ ప్రత్యూష‌…ఆమె కూడా ఓ క‌ళాకారిణి కావ‌డం చెప్ప‌కోదగ్గ విష‌యం.

సుమ‌న్ కూతురు చూడ్డానికి హీరోయిన్ ల రేంజ్ లో అందంగా ఉంటుంది. అంతే కాకుండా ఆమె భ‌ర‌త‌నాట్యం క‌ళాకారిణి ఇప్ప‌టికే చాలా కార్య‌క్ర‌మాల‌లో త‌న టాలెంట్ ను నిరూపించుకుంది. ర‌వీంద్ర‌భార‌తిలో చాలా షోల‌లో డ్యాన్స్ భ‌ర‌త నాట్యం చేసింది. ఇక ప్ర‌త్యుష‌జ కు చాలానే సినిమా ఆఫ‌ర్ లు కూడా వ‌చ్చాయి. కానీ ఆమెకు సినిమాల‌లో న‌టించ‌డం ఇష్టం లేక‌పోవ‌డంతో సుమ‌న్ ఆ ఆఫ‌ర్ ల‌ను రిజెక్ట్ చేశారు.

Visitors Are Also Reading