Home » RRR సైడ్ అవ్వడంతో లైన్ లోకి 10 సినిమాలు… సంక్రాంతికి సందడే…!

RRR సైడ్ అవ్వడంతో లైన్ లోకి 10 సినిమాలు… సంక్రాంతికి సందడే…!

by AJAY
Ad

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్ల వద్ద ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలై పోతుందని అని అంతా అనుకున్నారు. కానీ జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఆర్ఆర్ఆర్ విడుదలను వాయిదా వేసుకుంది. దాంతో చాలా చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలా మొత్తం తొమ్మిది సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Super macchi

Super macchi

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Dj tillu

Dj tillu

యంగ్ హీరో సిద్ధూ జొన్నగడ్డల నటించిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమా కూడా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

Athidi devo bhava

Athidi devo bhava

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన తాజా చిత్రం అతిధి దేవోభవ. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. సినిమాలో స్వేచ్ఛా హీరోయిన్ గా నటించింది.

Advertisement

Bangarraju teaser

Bangarraju teaser

ఇక నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటించారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ పక్కకు తప్పుకోవడం తో ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

7days 6nights

7days 6nights

ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సెవెన్ డేస్ సిక్స్ నైట్స్. ఈ సినిమాలో ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా సంక్రాంతి విడుదలకు రెడీగా ఉంది.

Rowdy boys

Rowdy boys

హుషారు మూవీ తో హిట్ అందుకున్న దర్శకుడు హర్ష కొనగంటి తెరకెక్కించిన మరో సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన సినిమా “హీరో”. ఈ చిత్రానికి ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా జనవరి 15న విడుదలకు సిద్ధంగా ఉంది.

Also read : నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading