Telugu News » Blog » “వీర సింహా రెడ్డి” థియేటర్ వద్ద ఓవరాక్షన్..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!

“వీర సింహా రెడ్డి” థియేటర్ వద్ద ఓవరాక్షన్..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!

by Bunty
Ads

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలయ్య కెరీర్ లోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని చెప్పాలి. ప్రీ సేల్స్ ద్వారానే ఎక్సలెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా రాయలసీమలో ఊహకందని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

Advertisement

veerasimhareddy-review

అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో బాలకృష్ణ అభిమానులు ఒక అడుగు ముందుకు వేశారు. తణుకులో లక్ష్మీ థియేటర్ దగ్గర గొర్రెపోతుని నందమూరి బాలకృష్ణ కటౌట్ ముందు బలి ఇచ్చి సినిమా సూపర్ హిట్ కావాలని వారంతా కోరుకున్నారు. అయితే ఇలా జంతు బలులకు సంబంధించి వ్యతిరేకంగా ప్రభుత్వ చట్టం చేయడంతో జంతు బలి ఇచ్చిన పది మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తనుకుకు చెందిన మట్ట వెంకట్, నల్లూరి సురేష్, పల్లూరి సురేంద్రనాథ్, షేక్ ఆరిఫ్, నందమూరి కేశవ, హర్ష, భట్టపల్లి నాగరాజు, పోలాటి రవికృష్ణ, గెడ్డం శీను అనే వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసి కోర్టు రిమాండ్ కి తరలించినట్లు తణుకు సీఐ ముత్యాల సత్యనారాయణ వెల్లడించారు. తమ అభిమాన హీరో సినిమా ఎలా అయినా సూపర్ హిట్ కావాలని కొందరు అభిమానులు గొర్రెను సినిమా హాల్ గేటు వద్ద బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిపై జంతు ప్రేమికులు కొందరు జంతు సంరక్షణ చట్టాల ప్రకారం తనకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని అంటున్నారు.

Advertisement

read also : వివాదంలో ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !