Home » గేమ్ ఛేంజర్ లో భారీ ఫైట్.. అది సినిమాకే హైలెట్ కానుందా..?

గేమ్ ఛేంజర్ లో భారీ ఫైట్.. అది సినిమాకే హైలెట్ కానుందా..?

by Anji
Ad

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓ పొలిటికల్ గవర్నమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. రామ్ చరణ్ ఇందులో ఓ రాజకీయనాయకుడిగా, అదేవిధంగా ప్రభుత్వ అధికారిగా రెండు షెడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకోవడం లేదన్నది తెలిసిందే. రామ్ చరణ్ తన భార్య ఉపాసనకు పుట్టబోయే పాప కోసం విరామం తీసుకోగా.. అటు శంకర్ ఇండియన్ 2 మూవీతో బిజీ అయ్యాడు. 

Advertisement

ఇక చరణ్ అభిమానులు కూడా ఈ గ్యాప్ వల్ల మూవీ అసలు షూటింగ్ జరుగుతుందా..? లేదా అనే సందేహంలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై సినిమా అప్డేట్ కోసం చేసినటువంటి రచ్చ గురించి తెలిసిందే. ఈ మూవీ రీసెంట్ గా మళ్లీ షూటింగ్ జరుపుకోవడం ప్రారంభమైంది. తొలుత ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు హీరో ఇద్దరూ పాల్గొనలేదు. ఈ సినిమా హీరో లేకుండా ఈ సినిమాలో నటిస్తున్న ఇతర పాత్రదారులకు సంబంధించిన సీన్లను ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను శంకర్ సలహాతో తెరకెక్కించాడట. ఆ సీన్ లో జూనియర్ ఆర్టిస్టులు రఘుబాబు, రాకేట్ రాఘవ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. 

Advertisement

తాజాగా గేమ్ ఛేంజర్ సెట్స్ లో శంకర్ అధికారికంగా అడుగుపెట్టాడట. ఈ చిత్రానికి సంబంధించి భారీ ఫైట్ సీన్ ని చిత్రీకరిస్తున్నట్టు శంకర్ తన ట్విట్టర్ పేజ్ లో పేర్కొన్నాడు. ఈ ఫైట్ సీన్ ఈ సినిమాలోని హైలెన్ సీన్లలో ఒకటిగా నిలుస్తుందని తెలిపాడు. అయితే ఈ చిత్ర యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఫైట్ సీన్ ఓ కారు ఛేజింగ్ సీన్ ఉండబోతుందని పేర్కొంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 80 శాతం వరకు పూర్తికాగా.. మిగతా షూటింగ్ పూర్తి అవ్వడానికి దాదాపు 90 రోజుల వరకు సమయం పట్టే అవకాశముందని సమాచారం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

కూతురి విషయంలో చరణ్ స్ట్రాంగ్ డెసిషన్.. ఉపాసన హర్ట్ అయిందా ?

చిరంజీవి వద్దన్న వినకుండా రామ్ చరణ్ నటించిన సినిమా ఏదో తెలుసా…?

Visitors Are Also Reading