Ad
ప్రస్తుతం ఉన్నది మొత్తం ఇంటర్నెట్.. సోషల్ మీడియా కలంఈ సమయంలో ఎవరు ఎలా దొరుకుతారా.. ఎవరిని ఎలా ట్రోల్ చేద్దామా అని ఉంటారు సోషల్ మీడియా జనాలు. ముఖ్యంగా సెలబ్రెటీలు ఏమైనా తప్పు చేస్తే.. ఇక అంతే వారిని దారుణంగా ట్రోల్ చేసి.. పరువు తీస్తారు. అయితే ఇప్పుడు భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పరిస్థితి అలానే ఉంది.
ఫుట్ బల్ లెజెండ్ గా ఉన్న క్రిస్టియానో రోనాల్డో తాజాగా 700 క్లబ్ గోల్స్ అనేవి సాధించి ఓ చరిత్ర క్రియేట్ చేసాడు. దాంతో చాలా మంది రోనాల్డోను సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. యువీ కూడా రోనాల్డోను ప్రశంసిస్తూ ఓ ట్విట్ వేసాడు కానీ.. అక్కడే దొరికిపోయాడు. అయితే యువీ.. రోనాల్డోను ప్రశంసించి.. 700 క్లబ్ గోల్స్ లోని మీకు స్వాగతం అని రాసుకొచ్చాడు.
అయితే క్రీడల్లో గతంలో ఆ ఫిట్ ను అందుకున్న ఆటగాడే.. తర్వాత మళ్ళీ ఎవరైనా ఆ ఫిట్ అందుకుంటే స్వాగతం అని పేర్కొంటారు. కానీ ఇక్కడ ఆ పదం అనేది క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ వాడటంతో ట్రోలింగ్ అనేది ప్రారంభం అయ్యింది. నువెప్పుడు.. ఈ 700 క్లబ్ గోల్స్ అనేవి సాధించవు అని ఒక్కరు అంటే.. యువీ ఓ ఫుట్ బల్ క్లబ్ ను ప్రరంభించినట్లు ఉన్నాడు. అందులో అతను ఒక్కడే ఆడుతూ 700 గోల్స్ చేసాడు కావచ్చు అంటూ పరువు తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
32 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్తున్న న్యూజిలాండ్ జట్టు..!
పాకిస్థాన్ పరువు తీసేసిన అశ్విన్..!
Advertisement