Home » ‘సొంత వారు అల్లం.. బ‌య‌టి వారు బెల్ల‌మా’ అంటున్న ష‌ర్మిల

‘సొంత వారు అల్లం.. బ‌య‌టి వారు బెల్ల‌మా’ అంటున్న ష‌ర్మిల

by Anji
Ad

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడం పట్ల ఆమె ప్రశ్నించారు. సొంత వాళ్లు అల్లం.. బయటి వాళ్లు బెల్లమా అంటూ.. సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా.. ఆమె ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా గాల్వ‌న్‌లో అమ‌రులైన సైనిక కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌లు ఇవ్వ‌డం త‌ప్పు కాదు. ఢిల్లీలో చ‌నిపోయిన రైతుల‌కు ప‌రిహారం అందించ‌డంలో త‌ప్పులేదు. కానీ తెలంగాణ కోసం అమ‌రులైన వారి కుటుంబాల‌కు సాయం ఎందుకు చేయ‌రు..? 1200 మంది అమ‌రులు అని ఉద్య‌మంలో గొంతు చించుకున్న మీకు అధికారంలోకి వ‌చ్చాక కొంద‌రే అమ‌రులెందుక‌య్యారు..? నోటిఫికేష‌న్ల కోసం ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న వంద‌ల మంది నిరుద్యోగుల‌ను ఎందుకు ఆదుకోరు..? అప్పుల పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాల‌ను ఎందుకు ఆదుకోరు..? క‌నీసం న‌ష్ట‌పోయిన పంట‌కు ప‌రిహారం ఎందుకు ఇవ్వ‌రు..? సొంత‌రాష్ట్రం వారిని అల్లం, బ‌య‌టి వారిని బెల్లం చేసుకోవ‌డ‌మే బంగారు భార‌త్‌కు బాట అంటూ వ్యాఖ్యానించింది.

Also Read :  Ukraine Russia War : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ప‌రారీ అయ్యాడా..?

Visitors Are Also Reading