విశాఖ ఉక్కును ప్రయివేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికీ నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు నిరసనగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్నీ పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపైగా ఎంపీలతో సంతకాలు చేయించి దానిని ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వనుంది.
Advertisement
Advertisement
ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌లో సమావేశమై వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. లాభాల్లో ఉన్న లాభాల్లోకి వచ్చే అవకాశమున్నా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకం అని ఆయన చెప్పారు.
ఈ విషయంలో అన్నీ పార్టీలను కలుపుకుని పోతామని చెప్పిన ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి నివేదిస్తామని వెల్లడించారు.
Also Read : నాటో ప్రయత్నాలు విరమిస్తాం.. రష్యాతో ఒప్పందానికి సిద్ధం : జెలెన్ స్కీ