ఏపీలో కొత్త జిల్లాల అంశంపై వైసీపీ నేతల మధ్య చిచ్చు పెడుతుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటన ఇది వాస్తవమే అని రుజువు చేసింది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన, బైకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు.
అయితే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో తనను తాను కొట్టుకుని వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఒక అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు క్షమించాలని ఆయన ప్రజానికాన్ని కోరడం గమనార్హం. ఈ నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ 2019లో నర్సాపురం ఎమ్మెల్యేగా అసమర్థుడైన ముదునురి ప్రసాద్‌రాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నట్టు ప్రకటించడమే కాదు.. అన్నంత పని చేసారు. కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడంతో అక్కడ కలకలం రేగింది. నిరసన సభలో పాల్గొన్న వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇదిలా ఉండగా.. ఇదంతా పబ్లిసిటి స్టంట్ అని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పుణ్యమా అని ఎమ్మెల్యే సుబ్బారాయుడు మధ్య విభేదాలు బయటపడ్డాయి.
Also Read : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి.. అందుకోసమేనా..?