Ys Sharmila : వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ పార్టీని క్షమించాలని కోరారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై తాజాగా షర్మిల స్పందించారు. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది సోనియా గాంధీ అయితే ఆమెతో కలిసి ఎలా పనిచేస్తావు అని మా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసింది కాదు.
వైఎస్ఆర్ మీద వారికి చాలా గౌరవం ఉందని వెల్లడించారు. వైఎస్ఆర్ చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ ప్రకారం రెండు కాలాలు దాటిపోయింది. కాబట్టి అవతలి వారిలో రియలైజేషన్ వచ్చినపుడు.. మనలో క్షమించే మనసు రావాలని కోరారు వైఎస్ షర్మిల. వండినట్లు, తిన్నట్లు కాదు రాజకీయాలు చేయడం అంటే.. నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. మన మధ్య నుంచి వెళ్ళిపోయిన కోట్ల మంది గుండెల్లో ఉన్నారని.. ఆయన అందించిన పథకాలు ఇంకా ఆయన్ని ప్రజల్లో ఉంచాయని తెలిపారు.
Advertisement
Advertisement
రైతులకు పెట్టుబడిని తగ్గించి.. రాబడి పెంచేలా చర్యలు తీసుకున్నారని.. మహిళలకు రుణాలు ఇచ్చారు.. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్మెంట్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి వల్ల ఎంతో మంది పునర్జన్మను పొందారు..ఐదు సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉన్న అందరిని ఆదుకున్నారు.. జనాల్లో ఉన్నారన్నారు. 46 లక్షల ఇళ్లను పేదలకు కట్టించారు..అన్ని వర్గాలకు న్యాయం చేశారు.. అందరిని ఆదుకున్నారని వివరించారు. ఆయన్ని మరణాన్ని జీర్ణించుకోలేక 700 మంది అభిమానుల గుండె ఆగిందన్నారు.
ఇవి కూడా చదవండి
Pawan Klayn : 470 కిలోల వెండి గొలుసులతో పవన్ కళ్యాణ్ బొమ్మ
Sunil : సునీల్ చెంప చెల్లుమనిపించిన టాలీవుడ్ హీరోయిన్..?
Anushka : పాన్ ఇండియా లెవెల్లో అనుష్క మూవీ.. 14 భాషల్లో రిలీజ్.. హీరో ఎవరంటే?