టాలీవుడ్ లో ప్రస్తుతం ఎవ్వరి నోటా చూసినా మెగా డాటర్ నిహారిక విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు. పెళ్లి అయిన తరువాత మూడేళ్లకే విడిపోవడం ఏంటని.. ఇంత మాత్రం దానికి అసలు పెళ్లి ఎందుకు చేసుకోవడం అవసరమా..? అంటూ ఎవ్వరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ మంది మాత్రం విడాకుల విషయంలో చైతన్య కంటే నిహారికదే తప్పు అంటూ ఆమెను నిందిస్తున్నారు.
Advertisement
నిహారిక విడాకుల విషయంలో కూడా మాట్లాడుకునే వారు లోలోపలనే మాట్లాడుకుంటుండగా.. బయటికి మాత్రం మెగా ఫ్యామిలీ పై అందరికీ అభిమానం ఉండటం మూలాన ఎవ్వరూ దీనిని ఇష్యూ చేయడం లేదు. అయితే విడాకులు అధికారికంగా కన్ ఫామ్ అయిన రోజు మాత్రం సోషల్ మీడియా పెద్ద ఎత్తున హడావిడి చేసిన మీమర్స్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. యంగ్ హీరో నాగశౌర్య మాత్రం నిహారిక కొణిదెల విడాకులపై గట్టిగానే స్పందించాడు. ఇక విషయం ఏంటంటే.. ఇటీవలే ఆయన హీరోగా నటించిన రంగబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన నాగశౌర్య విడాకుల గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
Advertisement
తనకు విడాకులపై అస్సలు నమ్మకం లేదని.. చెబుతూ.. ఇద్దరూ వ్యక్తులు కలిసి లైఫ్ షేర్ చేసుకున్నప్పుడు మనస్పార్థాలు అనేవి కచ్చితంగా వస్తాయి. మన పేరెంట్స్ కూడా మనకు గొడవలు అవుతుంటాయి.అలా అని మనం వారి రిలేషన్ ని వదులుకోం కదా.. ఒక్క లైఫ్ పార్ట్ నర్ విషయంలో మాత్రం మనం చాలా ఈజీగా డివోర్స్ అంటూ విడిపోతాం. ఈ జెనరేషన్ లో ఉన్న వారందరూ ఇలాగే చేస్తున్నారు ఇది తప్పు అంటూ చెప్పుకొచ్చాడు నాగశౌర్య. నిహారిక విడాకుల గురించి కాకపోయినప్పటికీ ఇటీవలే ఆమె విడాకులు ట్రెండ్ అవ్వడంతో నిహారిక గురించే చెప్పినట్టుగా బయటికీ ప్రొజెక్ట్ అవుతూ నెట్లో వైరల్ గా మారింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కష్టపడి భార్యను చదివిస్తే.. జాబ్ వచ్చాక వదిలేసిన భార్య.. చివరికీ ఏం జరిగిందంటే..?