ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప సినిమా పాటలు వినిబడుతూ ఉన్నాయి. ఈ పాటలకు క్రికెటర్లు, సెలెబ్రిటీలు డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. శ్రీవల్లి పాట బాగా పాపులర్ అయింది. ఈ పాట ఇన్‌స్టాగ్రామ్లో రీళ్ల హంగామా చేస్తుంది. శ్రీవల్లి పాటకు మరాఠీ వెర్షన్‌ను రూపొందించిన అమరావతి కుర్రాడి పాట యూట్యూబ్‌లో వైరలైంది. ఆ తరువాత సామీ సామీ పాటను ఓ వృద్ధురాలు పాడింది. మహారాష్ట్రలో వృద్ధురాలు సామీ సామీ పాటకు డ్యాన్స్ చేసింది.
Also Read : IND VS WI : వన్డేలో టీమిండియా ఘన విజయం .. కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్
Advertisement
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన ప్రచార గీతాన్ని విడుదల చేసింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ ట్యూన్‌ను తీసుకుని యూపీ రాష్ట్రం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఈ పాటను రూపొందించడం విశేషం.
Advertisement
అట దక్షిణ మధ్య రైల్వే కూడా బన్నీ సినిమాను వాడింది. ఇందులో భాగంగా తగ్గేదేలే అన్న డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ రైలు పట్టాలు ట్రాక్‌లపై నడిచేదేలే అని అల్లుఅర్జున్ పోస్టర్‌పై రాసుకొచ్చింది. అంతకుముందు హైదరాబాద్ పోలీసులు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిపించేందుకు పుష్ప డైలాగ్‌లను వినియోగించుకున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పుష్ప పాటలతో అదరగొడుతున్నారు. తాజాగా ఓ చిన్నోడు పుష్ప సినిమా డైలాగ్స్ తో ఇన్‌స్టా రిల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నోడి వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.