సాధారణంగా గోదుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గోధుమ గడ్డిలో బీ కాంప్లెక్స్, విటమిన్ ఏ, సీ, కే తో పాటు మెగ్నీషియం ఫైటో న్యూట్రుమెంట్ ఏదైనా క్యాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గోధుమ గడ్డిలో యాంటి బ్యాక్టిరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోధుమ గడ్డిలో ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడుతాయి. 2011లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. గోధుమ గడ్డి జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు ప్రేగులను శుభ్రపరుస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. వీట్ గ్రాస్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఆర్థోరైటీస్ సమస్యలకు చెక్.. గోధుమ గడ్డిలో యాంటి ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలుంటాయి. ఆర్థరైటిస్ కారణంగా వచ్చే బోన్ స్టిఫ్నెస్ నొప్పి వాపు లాంటి లక్షణాల నుంచి బయటపడేస్తుంది. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ ఇంప్లమేషన్ ని తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
Advertisement
Also Read : ప్రతిరోజు మూత్రం ఆపుకుంటున్నారా.. అయితే మీరు ఈ ప్రమాదంలో పడ్డట్టే!
కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తరువాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ షుగర్ కొవ్వు అధికంగా ఉండే ఆహారాల పట్ల కోరికను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేస్తుందట. టెస్ట్ ట్యూబ్ పరిశోధన ప్రకారం.. గోధుమ గడ్డి క్యాన్సర్ కణాలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మానవ పరిశోధనలు.. కీమోథెరపీ చెడు ప్రభావాలను తగ్గిస్తుందని తేలింది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. గోధుమ గడ్డి రసం మన గడ్డిలోని పోషకాలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. అదేవిధంగా ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా కరిగిస్తుంది. 2010 పరిశోధన ప్రకారం.. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచి గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలున్నటువంటి గోధుమగడ్డిని తీసుకోండి.. హెల్తీగా ఉండండి.
Also Read : నందమూరి కుటుంబానికే ఎందుకు కారు ప్రమాదాలు జరుగుతున్నాయి… వారికి ఆ శాపం తగిలిందా?