Home » జీలకర్రలో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

జీలకర్రలో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

సాధారణంగా జీలకర్ర అంటే వంటింట్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దానిని ప్రతీ వంటల్లో తప్పక వాడుతుంటారు. జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దీనిలో ఔషద గుణాలున్నాయి.చలికాలంలోనే కాకుండా ఏ కాలంలో అయినా ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతుంటారు. వైద్య నిపుణులు ప్రస్తుతం ఉన్న జీవన శైలి విధానంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్, వ్యాయామం వంటివి చేయడానికి సమయం సరిపోవడం లేదు. చిన్న వయస్సులో శరీరం మనకు మద్దతు ఇవ్వడం మానేస్తుంది. కొన్ని సార్లు మనం పూర్తిగా మెడిసిన్ మీద ఆధారపడుతుంటాం. 

Manam News

Advertisement

ఇలా ఔషదాల మీద ఎక్కువగా ఆధారపడడం అంత మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. వంట గదిలోనే ఎన్నో పదార్థాలుఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతున్నాయి. వంటింట్లో ఉండే జీలకర్రతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ఔషద గుణాలున్నాయి. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని ప్రారంభిస్తే.. ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శ్వాస కోశ వ్యవస్థపై ఎఫెక్ట్ జీలకర్ర నీరు శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలున్నప్పటికీ పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువ వాడితే కొన్ని  ఆరోగ్య సమస్యల భారిన పడే అవకాశముంటుంది. రక్తపోటును కంట్రోల్ జీలకర్ర నీటిలో చాలా పొటాషియం ఉంటుంది. నిత్యం జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది. 

Advertisement

Manam News

గర్భధారణ సమయంలో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా బలంగా మారుతుంది. గర్భీణీలు జీలకర్ర నీటిని తాగడంతో కార్భో హైడ్రేట్లు, కొవ్వులు, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు ఉద్దీపనగా పని చేస్తుంటాయి. మధుమేహాయగ్రస్తులకు జీలకర్ర నీళ్లు చాలా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. కారణంగా రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. నిత్యం జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల నిరోధకశక్తి బలంగా తయారవుతుంది. చాలా రకాల వ్యాధులతో పోరాటం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.  

Also Read :  నూతన సంవత్సర వేడుకలను ఫస్ట్ ఏ దేశం.. లాస్ట్ ఏ దేశం సెలబ్రేషన్స్ చేసుకుంటుందో తెలుసా ? 

Visitors Are Also Reading