దసరా సందర్భంగా ప్రతి ఏటా హర్యాణ గవర్నర్ దత్తత్రాయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా దత్తత్రాయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హట్టహాసంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వెళ్లాడు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి పై గరికపాటి నరసింహ రావు కొంత వరకు అసహాననాకి గురి అయ్యాడు. చిరంజీవి ఫోటో సెషన్ ముగించేస్తే తాను మాట్లాడుతానని, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యలు చేశాడు.
Also Read : గాడ్‌ఫాదర్ ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
Advertisement
దీనిపై మెగా అభిమానులు ఘాటుగా స్పందించారు. చిరంజీవి క్రేజ్ చూసి ఈర్శతో గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా దీనిపై స్పందించి ట్విట్టర్ వేదికగా గరికపాటికి చురకులు అంటించాడు. కొంత సమయం తర్వాత నాగ బాబు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. కానీ మెగా అభిమానులు మాత్రం గరికపాటి పై కోపంతో ఉన్నారు.
Advertisement
Also Read : ‘స్టూడెంట్ నెం 1’ నుంచి ‘RRR’ వరకు రాజమౌళి సినిమాల కలెక్షన్స్
తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వివాదంపై తన స్టైల్ లో స్పందించాడు. “సర్ నాగబాబు గారు మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు. సర్ నాగబాబు గారు ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్” అంటూ వర్మ ట్విట్టర్ వేదికగా గరికపాటిపై ఫైర్ అయ్యారు.
Also Read : ఆ ఒక్క సినిమాకి థమన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..?