Home » ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే.. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అష్టాచెమ్మా ఆడుతుంటారు. ఇక ఇంటి వద్దనే ఉండే వారు అయితే చింత గింజలతో రకరకాల ఆటలు ఆడుతుంటారు. ఇప్పుడు ఆ కాలం లేదు. మొత్తం మారిపోయింది. ఇప్పుడు గింజలు లేని చింతపండు వచ్చేయడంతో ఆ గేమ్స్ కి బ్రేక్ పడినట్టయింది. నిజం చెప్పాలంటే మనకు ఎంత దూరం అవుతున్నాయో.. వాటినే కొన్నింటినీ మార్కెట్ చేసుకుంటున్నాయి పలు ఆన్ లైన్ సంస్థలు. ఎంత బిజీ అయిపోయామంటే.. మన బిజీ లైఫ్ ని, బద్ధకాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి సదరు సంస్థలు. 

Also Read :  వేసవిలో మీ చర్మం ఆరోగ్యం కోసం ఇవి తీసుకుంటే ఫలితం పక్కా..!

Advertisement

పండుగ వేళలో అరిసెలు, బూరెలు, చక్రాలు, మామిడి ఆకులు, తోరణాలు అమ్ముతున్నాయి. అంతేకాదు.. చివరికీ అరిటాకులు, పిడకలు కూడా నెట్లింట్లో అమ్మకానికి పెడుతున్నాయి పలు వెబ్ సైట్లు. తాజాగా చింత గింజలను ఆన్ లైన్ లో ఆశ్చర్యంలో ముంచెత్తింది ఓ ఆన్ లైన్ సంస్థ. మనం ఇంట్లో అమ్మ ఏదైనా పులుసు కూర వండితే.. ఒకటో రెండో చింత గింజలు వస్తే.. ఏం చేస్తుంది. తినలేం కాబట్టి వాటిని పారేస్తుంది. అవి పారేయొద్దని అమ్మకు చెప్పండి.. ఎందుకు అంటారా..? ఎందుకు అంటే ఇప్పుడు ఆన్ లైన్ సంస్థలు వాటిని కూడా అమ్మేస్తున్నాయన్న మాట. చింతకాలయలను, పండును అమ్మకానికి పెడితే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనినే ఏకంగా చింత పిక్కలను అమ్మకానికి పెట్టింది ఫ్లిప్ కార్ట్. వీటిని మామూలుగా, కాల్చిన చింత గింజలను కూడా అమ్ముతోంది. ఒక్కో ఫ్యాకెట్ ధర రూ.110గా నిర్ణయించింది. 

Advertisement

Also Read :   హారతిపళ్లెంలో డబ్బులు ఎందుకు వేయాలో తెలుసా..?

ఈ ఫ్యాకెట్ కేవలం 100 చింతగింజలు మాత్రమే ఉంటాయి. ఒక్క చింత గింజ ధర రూాపాయికి పైనే అన్నమాట. చింతగింజలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గింజలకు క్యాష్ అన్ డెలివరీ కూడా చేయనుంది ఆ సంస్థ. చింత పిక్కలను అమ్మకానికి పెట్టడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. చింత గింజలను వ్యాపారం చేస్తారని తెలిస్తే చిన్నప్పటి నుంచే దాచుకునే వాళ్లమని కొందరూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వ్యాపారం చేసేందుకు ఏదు అడ్డంకి కాదని నిరూపించింది ఆ సంస్థ. చింత గింజల్లో పోషక విలువలు మెండుగా ఉండడంతో వాటిని కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చింత గింజల వ్యాపారానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :  పారాసిటమాల్ వాడుతున్నారా? వీటి వల్ల గుండెపోటు వస్తుందా!

Visitors Are Also Reading