ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం పలు చర్యలు చేపడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు నిబంధనలు మార్చుతూ ఖాతాదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈపీఎఫ్ఓ చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. గతంలో ఏదైనా పనుల నిమిత్తం పీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఖాతాదారుడు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో పీఎఫ్ కు సంబంధించిన సేవలను పొందవచ్చు.
Advertisement
మీ డబ్బును ఒక పీఎఫ్ అకౌంట్ నుంచి మరొక దానికి బదిలీ చేయాలనుకుంటే సులభమైన పద్దతుల ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దాని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సి వచ్చిన అవసరమే లేకుండా ఇంట్లో ఉండి ఈపీఎఫ్ బదిలీ చేసుకోవచ్చు. మీరు పీఎఫ్ నుంచి డబ్బును బదిలీ చేయాలనుకుంటే తొలుత యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్ ) యాక్టివేట్ అయి ఉండాలి.
Advertisement
- http://unifiedportal mem.epfindia.gov.in/memberinterface/కి వెళ్లి యూనివర్సల్ అకౌంట్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇక్కడ లాగిన్ కావాలి.
- లాగిన్ అయిన తరువాత ఆన్‌లైన్ సర్వీస్‌కి వెళ్లి one Member-One EPF Account బదిలీ అభ్యర్థన ఎంపికపై క్లిక్ చేయాలి.
- దీనిలో మీరు వ్యక్తిగత సమాచారం, పీఎఫ్ ఖాతాను ధృవీకరించండి. అదేవిధంగా మీరు మీ ప్రస్తుత ఉద్యోగ సమాచారాన్ని కూడా అందించాలి.
- ఆ తరువాత Get Details ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మునుపటి అపాయింట్‌మెంట్ పీఎఫ్ ఖాతా వివరాలన్ని స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- మీరు మీ ఆన్‌లైన్ క్లెయిమ్ ఫారమ్‌కు ధృవీకరించడానికి మునుపటి యజమాని ప్రస్తుత యజమాని మధ్య ఎంచుకోవడానికి ఎంపికను కలిగి ఉంటారు. మీరు అధికృత సంతకం హోల్డింగ్ డీఎస్‌సీ లభ్యత ఆధారంగా దీనినే ఎంచుకుంటారు. యజమానులలో ఎవరినైనా ఎంచుకుని సభ్యుల ఐడీ లేదా యూఏఎన్ ఇవ్వండి.
- UAN నమోదిత మొబైల్ నెంబర్ ద్వారా OTP స్వీకరించడానికి Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ పై క్లిచ్ చేయాలి.
- OTP ధృవీకరించి తరువాత ఆన్‌లైన్ నగదు బదిలీ ప్రక్రియ కోసం అభ్యర్థన మునుపటి కంపెనీకి వెళ్తుంది.
- మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ముందుగా కంపెనీ దానిని బదిలీ చేస్తుంది. ఆ తరువాత ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ దానిని వెరిఫై చేసి ధృవీకరించిన తరువాత మీ డబ్బు బదిలీ చేయబడుతుంది.
- బదిలీ పూర్తయిందో లేదా అని తెలుసుకోవడానికి క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు.
- ఆఫ్ లైన్ బదిలీ కోసం మీరు ఫారం 13 నింపి మీ పాత కంపెనీకి లేదా కొత్త కంపెనీకి ఇవ్వాలి.
ఇవి తప్పనిసరిగా ఉండాలి
- ఈ నెంబర్‌కు OTP పంపబడుతుంది కాబట్టి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా యాక్టివ్ గా ఉండాలి.
- ఉద్యోగి బ్యాంకు ఖాతా నెంబర్ ఆధార్ నెంబర్‌ను యూఏఎన్‌తో లింక్ చేయాలి.
- మునుపటి అపాయింట్‌మెంట్ నిష్క్రమణ తేదీని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
- E-KYC యజమాని ముందుగానే ఆమోదించాలి.
- మనుపటి సభ్యుల ఐడీ కోసం ఒక బదిలీ అభ్యర్థన మాత్రమే అంగీకరించబడుతుంది.
- ధరఖాస్తు చేయడానికి ముందు సభ్యుల ప్రొఫైల్‌లో ఇచ్చిన మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరించండి, అలాగే నిర్థారించండి.