Home » అక్క‌డ ఎన్ని బీర్లు కావాలంటే అన్ని బీర్లు తాగొచ్చు.. అదే మీ ఉద్యోగం..!

అక్క‌డ ఎన్ని బీర్లు కావాలంటే అన్ని బీర్లు తాగొచ్చు.. అదే మీ ఉద్యోగం..!

by Anji
Ad

సాధార‌ణంగా బీరు తాగుతారంటే వారు తాగుబోతు అది, ఇది అని అంటుంటారు. ఇవి ప‌క్క‌కు పెడితే బీరు తాగాలంటే మాత్రం డ‌బ్బులుండాలి. కానీ అక్క‌డ డ‌బ్బులు లేకుండా బీర్లు ఇచ్చి తాగ‌మంటారట‌. అది కూడా కావాల్సిన‌న్ని ఇచ్చి తాగినందుకు నెల‌కు జీతం ఇస్తామంటే ఇంకా ఎవ్వ‌రు కాదంటారు. బీరు ప్రియుల‌కు అంత‌కంటే ఆనందం ఇక మ‌రొక‌టి ఉండ‌దు. ఇలాంటి డ్రీమ్ జాబ్ ను ప్ర‌ముఖ జ‌ర్మ‌నీ కంపెనీ ఆల్డీ రూపొందించింది. ఈ కంపెనీ అధికారిక బీరు టెస్ట‌ర్ కోసం వెతుకుతోంది. ఈ టెస్ట‌ర్ యొక్క నాలుక మొగ్గ‌లు బలంగా ఉండాలి. దీంతో బీరు రుచిని స‌వివ‌రంగా వివ‌రించ‌గ‌ల‌డు.

Advertisement

ఇక ఆ వివ‌ర‌ణ ఆధారంగా కంపెనీ అత్యుత్త‌మ బీరును త‌యారు చేయ‌డం ద్వారా త‌న వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ పోస్ట్ లో మాత్ర‌మే ప్ర‌జ‌లు బీరును ప‌రీక్షించాలి. దాని రుచి గురించి వివ‌ర‌ణ ఇవ్వాలి. విదేశీ సూప‌ర్ మార్కెట్ల‌లో ఆల్డీ పేరు చాలా ఎక్కువ‌గా వ‌స్తుంది. ఇక్క‌డ అధికారిక బీరు టెస్ట‌ర్ పోస్టు ఖాళీగా ఉంది. అందులో ప‌ని చేసే వ్య‌క్తి చాలా సింపుల్ రోల్ పోషించాల్సి ఉంటుంది. ఈ చైన్ మీ ఇంటికి బీరు బాటిళ్ల‌ను పంపుతుంది. దీని త‌రువాత మీరు దాని ప‌రీక్ష‌ను చాలా నిజాయితీగా స‌మీక్షించాలి. ఎందుకంటే అదే స‌మీక్ష ప్ర‌కారం.. వైన్ టెస్ట్ వినియోగ‌దారుల ఎంపిక‌కు అనుగుణంగా స‌వ‌రించ‌బ‌డుతుంది. ఇక ఆ త‌రువాత రూపొందించ‌బ‌డుతుంది.

Advertisement


ఆల్డీ దీని గురించి మ‌రింత స‌మాచార‌మిస్తూ.. ఈ పోస్ట్ కోసం చూస్తున్న వ్య‌క్తి శ్ర‌ద్ధ గ‌ల డీఎం అయి ఉండాల్సి ఉంటుంద‌ని తెలిపింది. రుచి వివ‌ర‌ణ చాలా నిజాయితీగా ఇవ్వాలి. ఒక్కో టెస్ట‌ర్‌కు 10 రుచుల బీర్లు పంప‌బ‌డుతాయి. మీరు ఈ ఉద్యోగానికి స‌రైన వారు అని భావిస్తే కంపెనీని ఎందుకు ఎంచుకోవాలో తెలియ‌జేస్తూ.. Aldi అధికారిక ఈ మెయిల్ ఐడీకి మెయిల్ పంపాలి. ఇదే కాకుండా.. మీకు ఇష్ట‌మైన బీరు పేరు, దాని రుచిని చెప్పాలి. ఆ త‌రువాత మీరు ఈ పాత్ర కోసం మీ పూర్తి వివ‌రాలు, మీ ప్రాముఖ్య‌త‌ను 150 ప‌దాల్లో చెప్పాలి.

Also Read : 

Chanakya Niti : కాకి నుంచి ఈ నాలుగు విష‌యాల‌ను నేర్చుకుంటే మీకు జీవితంలో తిరుగుండ‌దు..!

ప‌రిగ‌డుపున ఇది తాగారంటే షుగ‌ర్‌, బీపీ కంట్రోల్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading